Home » Entertainment » Bullet Bhaskar About Jabardasth Varsha Plastic Surgery
Entertainment

Jabardasth Varsha : వర్ష చాలానే ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుందా?.. అసలు విషయం బయటపెట్టేసిన బుల్లెట్ భాస్కర్

Authored By
aruna
The Telugu News | Published on: August 2, 2022, 4:20 pm
Advertisement

Jabardasth Varsha : జబర్దస్త్ షోలో కౌంటర్లు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఒక్కోసారి శృతి మించుతాయి. ఎక్కువగా బాడీ షేమింగ్ మీద కామెంట్లు వస్తుంటాయి. ఆడవారి మీద ఈ కామెంట్లు ఎక్కువగావస్తుంటాయి. ఇన్నాళ్లు లేడీ గెటప్స్ మీద పంచులు వేస్తుండేవారు. ఇక ఇప్పుడు నేరుగా లేడీస్ మీదే కౌంటర్లు వస్తున్నాయి. అందులోనూ వర్ష మీద ఎక్కువగా కామెంట్లు వినిపిస్తుంటాయి. అందరూ ఆమెను లేడీ గెటప్, మగాడు, కీచు గొంతు అంటూ నానా రకాలుగా ఆమె మీద కౌంటర్లు వేస్తుంటారు. అయితే అవన్నీ వర్ష ఎక్కువ సీరియస్‌గా తీసుకోనట్టు కనిపిస్తుంది. జబర్దస్త్ షోలో కొన్ని కౌంటర్లు రాసుకుంటారు. వాటికి రియల్ లైఫ్‌లకు కాస్త సంబంధం ఉండే ఉంటుంది.

Advertisement

ఎందుకంటే వారు తమ జీవితంలోని ఘటనలను కూడా జబర్దస్త్ స్టేజ్ మీదకు తీసుకొస్తుంటారు. రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటనల మీద కూడా కౌంటర్లు రాస్తుంటారు. అలా వర్ష మీద చాలా సార్లు ప్లాస్టిక్ సర్జరీలు గురించి కౌంటర్లు వచ్చాయి. ఎన్నో స్కిట్లలో ఆమె ప్లాస్టిక్ సర్జరీ గురించి టాపిక్ వచ్చింది. అంటే నిజంగానే ఆమె ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుందని అర్థమవుతోంది. ఇక తాజాగా బుల్లెట్ భాస్కర్ కూడా కౌంటర్లు వేశాడు. తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకు సంబంధించిన ప్రోమో వచ్చింది. ఇందులో బుల్లెట్ భాస్కర్ టీం అదరగొట్టేసింది. అరుంధతి స్పూప్ వేసింది. ఇక ఇందులో మొదటి సారి జేజమ్మగా వర్ష నటించింది. ఆ తరువాత ఫైమా నటించింది.

Bullet Bhaskar ABout Jabardasth Varsha Plastic Surgery

Advertisement

పశుపతిగా ఇమాన్యుయేల్ నటించాడు. అయితే వర్ష జేజమ్మగా ఉన్న సమయంలో బుల్లెట్ భాస్కర్ కొన్ని కౌంటర్లు వేస్తాడు. రష్మీని చూపిస్తూ.. ఆవిడ ఎవరు? అని అడుగుతుంది వర్ష. రేష్మీ అనే మహారాణి.. ఆమె రాజు పక్క రాజ్యానికి దండెత్తడానికి వెళ్లాడు అందుకే అలా పక్క చూపులు చూస్తోందంటూ కౌంటర్లు వేస్తాడు. ఇక మన ఖజానా ఎలా ఉంది? అని వర్ష అడుగుతుంది. అస్సలు బాగా లేదు అని అంటాడు భాస్కర్. ఎందుకు ఏమైంది? అని వర్ష అంటే.. మీ ప్లాస్టిక్ సర్జరీలకు ఉన్నదంతా అయిపోయింది అని భాస్కర్ కౌంటర్లు వేస్తాడు. దీంతో వర్ష తల పట్టుకటుని కిందకు దించుకుంటుంది. అంటే నిజంగానే బయట కూడా ఆమె చాలానే ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుందా? అని అందరూ అనుకుంటున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి