Bulli Raju : నిన్న వెంకీ .. ఇప్పుడు చిరు..బుల్లి రాజా మజాకా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bulli Raju : నిన్న వెంకీ .. ఇప్పుడు చిరు..బుల్లి రాజా మజాకా..!

 Authored By ramu | The Telugu News | Updated on :17 March 2025,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Bulli Raju : నిన్న వెంకీ .. ఇప్పుడు చిరు..బుల్లి రాజా మజాకా..!

Bulli Raju : ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన బుల్లి రాజు (రేవంత్) ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయాడు. చిన్న వయస్సులోనే తన అద్భుతమైన డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్‌తో అందర్నీ ఆకట్టుకున్న ఈ చిచ్చరపిడుగు, సినిమా విజయం తర్వాత వరుస అవకాశాలను దక్కించుకుంటున్నాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత దాదాపు 20 సినిమాల నుంచి ఆఫర్లు వచ్చినా, బుల్లి రాజు ఎలాంటి ప్రాజెక్ట్‌కి కమిట్ కాలేదు. తాజాగా అతను రోజుకు రూ. 1 లక్ష పారితోషికం అడుగుతున్నాడని, నిర్మాతలు కూడా అతనికి అడిగినంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Bulli Raju నిన్న వెంకీ ఇప్పుడు చిరుబుల్లి రాజా మజాకా

Bulli Raju : నిన్న వెంకీ .. ఇప్పుడు చిరు..బుల్లి రాజా మజాకా..!

Bulli Raju రోజుకు రూ.లక్ష తీసుకుంటున్న బుల్లి రాజు..?

ఇప్పుడు బుల్లి రాజు మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బుల్లి రాజుకు ఓ కీలక పాత్ర లభించినట్టు సమాచారం. హీరోయిన్లుగా మృణాల్ ఠాకూర్, అంజలి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌పై చిత్రబృందం అధికారిక ప్రకటన చేయకపోయినా, జూన్ లేదా జూలైలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నాడు. ఇప్పటికే ఒక ట్యూన్ సిద్ధమయ్యిందని, ఈ పాటను ప్రముఖ గాయకుడు రమణ గోగుల ఆలపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 2026 సంక్రాంతికి ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేలా చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ సినిమా, అనిల్ రావిపూడి కామెడీ టచ్, బుల్లి రాజు హాస్యంతో ఈ ప్రాజెక్ట్‌కు మరింత హైప్ ఏర్పడింది. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది