Balakrishna : బాలకృష్ణ, రవితేజల మధ్య గొడవలపై క్లారిటీనిచ్చిన డైరెక్టర్ రవి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Balakrishna : బాలకృష్ణ, రవితేజల మధ్య గొడవలపై క్లారిటీనిచ్చిన డైరెక్టర్ రవి..!

Balakrishna : టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రజెంట్ ఓ వైపు ‘అఖండ’ ఫిల్మ్ సక్సెస్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మరో వైపున తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ‘అన్ స్టాపెబుల్ విత్ ఎన్ బీకే’కు హోస్ట్‌గా వ్యవహరిస్తూ దూసుకుపోతున్నారు. ఈ షోకు టాలీవుడ్ బిగ్ సెలబ్రిటీలు గెస్టులుగా వస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గెస్టుగా వచ్చిన ప్రోమో విడుదల కాగా, అది నెట్టింట బాగా వైరలవుతోంది. ఈ సంగతులు అలా […]

 Authored By mallesh | The Telugu News | Updated on :23 January 2022,7:30 pm

Balakrishna : టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రజెంట్ ఓ వైపు ‘అఖండ’ ఫిల్మ్ సక్సెస్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మరో వైపున తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ‘అన్ స్టాపెబుల్ విత్ ఎన్ బీకే’కు హోస్ట్‌గా వ్యవహరిస్తూ దూసుకుపోతున్నారు. ఈ షోకు టాలీవుడ్ బిగ్ సెలబ్రిటీలు గెస్టులుగా వస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గెస్టుగా వచ్చిన ప్రోమో విడుదల కాగా, అది నెట్టింట బాగా వైరలవుతోంది. ఈ సంగతులు అలా ఉంచితే.. బాలయ్య, రవితేజల మధ్య ఉన్న గొడవపై టాలీవుడ్ డైరెక్టర్ బీవీఎస్ క్లారిటీనిచ్చారు.

‘అన్ స్టాపెబుల్’షోతో బాలయ్య ప్రజెంట్ దూసుకుపోతున్నారు. ఈ షో చూసి తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. సినీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసే విధానంలో సరికొత్త పోకడలను బాలయ్య తీసుకొచ్చారని ఈ సందర్భంగా చెప్పొచ్చు. సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూనే ఎంటర్ టైన్మెంట్ అందిస్తున్నారు. ఇకపోతే ఇటీవల ఈ షోకు రవితేజ హాజరు కాగా, అది చూసి జనాలు తెగ సంబురపడిపోతున్నారు.ఇందులో తనకు, రవితేజకు ఉన్న గొడవల గురించి బాలయ్య ప్రస్తావించారు. పనీ పాటా లేని డ్యాష్ గాళ్లే అటువంటి రూమర్స్ క్రియేట్ చేశారని ఈ సందర్భంగా రవితేజ్ చెప్పారు.

Balakrishna : ‘అన్ స్టాపెబుల్’ రైటర్‌గా ఎంజాయ్ చేస్తున్నానన్న రవి..

bvs ravi reaction on balakrishna raviteja clashes

bvs ravi reaction on balakrishna raviteja clashes

కాగా, ఈ విషయమై ‘అన్ స్టాపెబుల్’ షో రైటర్ బీవీఎస్ రవి అలియాస్ మచ్చ రవి కూడా స్పందించారు. తనకు రవితేజ 20 ఏళ్ల నుంచి తెలుసని, రవితేజకు, బాలయ్యకు మధ్య ఎటువంటి క్లాష్ లేదని తెలిపారు. షూటింగ్స్ సందర్భంగా బాలయ్య, రవితేజ హ్యాపీగా ముచ్చటించుకుంటారని, చిరంజీవి ఇచ్చిన పార్టీలో బాలయ్య, రవితేజ, తాము చక్కగా ఎంజాయ్ చేశామని ఈ సందర్భంగా బీవీఎస్ రవి చెప్పుకొచ్చాడు. బీవీఎస్ రవి మెగా హీరో సాయిధరమ్ తేజ్‌తో ‘జవాన్’ సినిమా తీశాడు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సక్సెస్ అయింది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది