bvs ravi reaction on balakrishna raviteja clashes
Balakrishna : టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రజెంట్ ఓ వైపు ‘అఖండ’ ఫిల్మ్ సక్సెస్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మరో వైపున తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ‘అన్ స్టాపెబుల్ విత్ ఎన్ బీకే’కు హోస్ట్‌గా వ్యవహరిస్తూ దూసుకుపోతున్నారు. ఈ షోకు టాలీవుడ్ బిగ్ సెలబ్రిటీలు గెస్టులుగా వస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గెస్టుగా వచ్చిన ప్రోమో విడుదల కాగా, అది నెట్టింట బాగా వైరలవుతోంది. ఈ సంగతులు అలా ఉంచితే.. బాలయ్య, రవితేజల మధ్య ఉన్న గొడవపై టాలీవుడ్ డైరెక్టర్ బీవీఎస్ క్లారిటీనిచ్చారు.
‘అన్ స్టాపెబుల్’షోతో బాలయ్య ప్రజెంట్ దూసుకుపోతున్నారు. ఈ షో చూసి తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. సినీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసే విధానంలో సరికొత్త పోకడలను బాలయ్య తీసుకొచ్చారని ఈ సందర్భంగా చెప్పొచ్చు. సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూనే ఎంటర్ టైన్మెంట్ అందిస్తున్నారు. ఇకపోతే ఇటీవల ఈ షోకు రవితేజ హాజరు కాగా, అది చూసి జనాలు తెగ సంబురపడిపోతున్నారు.ఇందులో తనకు, రవితేజకు ఉన్న గొడవల గురించి బాలయ్య ప్రస్తావించారు. పనీ పాటా లేని డ్యాష్ గాళ్లే అటువంటి రూమర్స్ క్రియేట్ చేశారని ఈ సందర్భంగా రవితేజ్ చెప్పారు.
bvs ravi reaction on balakrishna raviteja clashes
కాగా, ఈ విషయమై ‘అన్ స్టాపెబుల్’ షో రైటర్ బీవీఎస్ రవి అలియాస్ మచ్చ రవి కూడా స్పందించారు. తనకు రవితేజ 20 ఏళ్ల నుంచి తెలుసని, రవితేజకు, బాలయ్యకు మధ్య ఎటువంటి క్లాష్ లేదని తెలిపారు. షూటింగ్స్ సందర్భంగా బాలయ్య, రవితేజ హ్యాపీగా ముచ్చటించుకుంటారని, చిరంజీవి ఇచ్చిన పార్టీలో బాలయ్య, రవితేజ, తాము చక్కగా ఎంజాయ్ చేశామని ఈ సందర్భంగా బీవీఎస్ రవి చెప్పుకొచ్చాడు. బీవీఎస్ రవి మెగా హీరో సాయిధరమ్ తేజ్‌తో ‘జవాన్’ సినిమా తీశాడు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సక్సెస్ అయింది.
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
This website uses cookies.