Categories: EntertainmentNews

C. Kalyan : నట్టి కుమార్‌పై సి.కళ్యాణ్ సెన్షేషనల్ కామెంట్స్..!

C. Kalyan : ఇండస్ట్రీలో ఇద్దరి మధ్య వైరం అనేది కొన్ని సందర్భాలలో ఊహించని విధంగా తలెత్తుతుంటుంది. అది దర్శకుడు – నిర్మాత, హీరో – నిర్మాత, లేదా ఇద్దరు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు..ఎవరైనా కావచ్చు. ఇక్కడ ఆదిపత్యం చలామణి అవుతుంది అనేది చాలా మంది చెప్పే మాటే. డబ్బు, పరపతి ఉన్న వాళ్ళదే పై చేయి. ఈ నేపథ్యంలోనే కొన్ని గొడవలకి దారి తీస్తాయి. టాలీవుడ్ లో ఇద్దరి మధ్య ఈ వ్యవహారం అప్పుడుడప్పుడు మరీ ముదురుతోంది. వారే నిర్మాతలు సి. కళ్యాణ్ – నట్టి కుమార్‌. సికే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌లో ఇప్పటికే నిర్మాత సి కళ్యాణ్ భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించారు. అందులోనూ నందమూరి బాలకృష్ణతో రూలర్, జై సింహా చేయడంతో బాగా పాపులర్ అయ్యారు.

అయితే గత కొంత కాలంగా సి. కళ్యాణ్‌- నట్టి కుమార్‌ల మధ్య వైరం ఉన్న సంగతి ఇండస్ట్రీ వర్గాల తో పాటు బయట జనాలకి తెలిసిందే. ఒకర్నొకరు బహిరంగంగానే దూషించుకోవడమే కాదు, కేసులు పెట్టుకునే వరకూ వెళ్ళారు. ఈ నేపథ్యంలోనే ఓ సారి సి. కళ్యాణ్.. నట్టి కుమార్‌ని గన్ పెట్టి చంపేస్తా అని బెదిరించిన ఘటన పెద్ద సంచలనం అయ్యింది. ఇటీవల ఈ వ్యవహారం పై సి. కళ్యాణ్ స్పందించాడు. వాడ్ని గన్‌తో బెదిరించే ఛాన్స్ ఉంటే కాల్చకుండా వదులుతానా. నాది గన్ కల్చర్‌ కాదు. నా కళ్లే గన్. నేను నిజంగా వాడ్ని ఏదైనా చేయాలని అనుకుంటే ఇంత కాలం ఉండేవాడు కాదు. నేను శత్రువుతో కూడా మాట్లాడతానని అందరికీ తెలుసు. అది నా వీక్నెస్ కాదు. అయినా దేవుడు ఇచ్చిన జీవితాన్ని ఇలా గడపాలని అనుకున్నా అంతే. నా మీద వాడు కేసుపెట్టుకున్నాడు. నేను వాడ్ని బెదిరించడం ఏంటి.. కాల్చి చంపేస్తా కదా అన్నాడు.

c-kalyan sensational comments on natti kumar…!

C. Kalyan : ఏరా నట్టి.. ఎందుకు నీకు.. సి.కళ్యాణ్

మా మధ్య గొడవకి కూడా పెద్ద కారణాలు లేవు. ఏదైనా ఉంటే.. ‘ఏరా నట్టి.. ఎందుకు నీకు అనే అడుగుతా’.. అవసరానికి నటించేవాడు.. నేను ఆ టైపు కాదు. ‘శంఖం’ సినిమాకి వాడు డబ్బులు కట్టకపోతే.. అది ల్యాబ్‌లో చేసిన సినిమా కాబట్టి డబ్బులు ఇస్తేనే ప్రింట్‌లు ఇస్తాం అని అన్నాం. తీరా ఇచ్చిన తరువాత ఆ సినిమా ఆడలేదు. అది నీ కర్మ. నిన్ను ఎవడు కొనమన్నాడు? వాడు చేసే పనులన్నీ ఇలాంటి పనులే. థియేటర్స్ లీజుకు తీసుకోవడం.. బ్లాక్ మెయిల్ చేయడం.. సినిమాలు కొనడం.. అప్పుడు కూడా బ్లాక్ మెయిల్ చేస్తాడు. వాడికి నాకు పెద్ద గొడవేం లేదు. అవకాశవాది అంతే. ఏరోజుకి అవసరం అని అనిపిస్తే అది మాట్లాడేస్తాడు. మరుసటి రోజు మొహంపై ఉమ్మేసినా పట్టించుకోడు.

వాడి కొడుకు ఏదో రీసెర్చ్ చేస్తున్నా అంటే ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ సినిమా కంటెంట్ ఇచ్చా.. వాడేమో యూట్యూబ్‌లో పెట్టేశాడు. దర్శకుడు గోల పెడితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చా. నా స్నేహితుడు కొడుకు అని మళ్ళీ కేసు వెనక్కి తీసుకున్నా. కానీ చివరికి నట్టి కుమార్ వాడి కొడుకు, కూతుర్ని మీడియా ముందుకు తీసుకుని వచ్చి నాకు వ్యతిరేకంగా మాట్లాడించాడు. ఎవరి కర్మ వాడిదే అని వదిలేశా. ఆ తరువాత రామ్ గోపాల్ వర్మ సినిమాకి వాళ్లే కనిపించి
నాకు బొకే ఇచ్చి నమస్తే అంకుల్ అంటే లోపల నవ్వుకున్నా. ఆ తరువాత మళ్లీ వాడికే చెప్పా. ఏదైనా ఉంటే డైరెక్ట్‌గానే వాడ్ని తిడతా’ అంటూ నట్టి కుమార్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు సి. కళ్యాణ్. అయితే దీనిపై నట్టి కుమార్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఇప్పటికే నట్టి కుమార్ పలువురు టాలీవుడ్ మేకర్స్‌కి, డిస్ట్రిబ్యూటర్స్ కి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలున్నాయి.

Recent Posts

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

8 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

8 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

10 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

11 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

12 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

13 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

14 hours ago

Ponnam Prabhakar : బనకచర్ల పేరుతో నారా లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు : పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…

14 hours ago