Home » Entertainment » Casting Couch In Bigg Boss Telugu Also
Entertainment

Bigg Boss Telugu : బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లాలంటే ప‌క్క‌లో ప‌డుకోవాలంట‌..ఈ విష‌యం చెప్పిందెవ‌రో కాదు!

Authored By
Sam C
The Telugu News | Published on: January 4, 2022, 9:30 pm
Advertisement

Bigg Boss Telugu : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో స‌క్సెస్‌ఫుల్‌గా సాగుతుంది. హాలివుడ్‌లో సూపర్ హిట్ అయిన ఈ కాన్సెప్ట్‌ను.. మొదటిగా హిందీలో.. ఆ తర్వాత దక్షినాది భాషలలో ప్రారంభించారు. తెలుగులో ఇప్పటిదాకా బిగ్ బాస్ ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. దీనిపై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా కూడా ఈ షోని స‌క్సెస్‌ఫుల్‌గా ముందుకు న‌డిపిస్తున్నారు. అయితే ఇటీవ‌ల నాగార్జున బిగ్ బాస్ ఓటీటీ కూడా రానుంద‌ని తెలియ‌జేయ‌గా, దీనికి సంబంధించిన కార్య‌క్ర‌మాలు ముమ్మ‌రంగా సాగుతున్నాయి.

Advertisement

ఇప్పటిదాకా బిగ్ బాస్ హౌస్‌లో జరిగే విషయాలను బుల్లితెరపై కేవలం 1 గంట మాత్రమే చూపించగా.. ఇప్పుడు ఓటీటీలో 24 గంటల పాటు చూపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మ‌రోవైపు ప్రస్తుతం కంటెస్టెంట్ల కోసం వెతుకులాట జరుగుతోందని టాక్. యాంకర్‌ శివ, వర్షిణి, వైష్ణవి, ఢీ విజేత రాజు పేర్లు బిగ్ బాస్ ఓటీటీలోకి ఎంటర్ కానున్న కంటెస్టెంట్ల లిస్టులో ఉన్నట్లు సమాచారం. కాగా, ఫిబ్రవరి 20వ తేదీన ఈ బిగ్ బాస్ ఓటీటీ షో లాంచ్ కానుందని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా షోకి సంబంధించిన ఓ వార్త హాట్ టాపిక్‌గా మారింది.

casting couch in bigg boss Telugu also

Advertisement

Bigg Boss Telugu : ఇప్పుడు 24 గంటల ఆనందం

బిగ్ బాస్ ఓటీటీకి ఆఫర్ అందుకున్న ఓ సోషల్ మీడియా స్టార్ బిగ్ బాస్ లోకి వెళ్ళేందుకు ఓకే చెప్పిందట. అయితే ఆమెని హోట‌ల్‌కు పిలిచి పారితోషికం గురించి మాట్లాడ‌దాం ర‌మ్మ‌ని అన్నార‌ట‌. దీంతో ఆమె అక్క‌డికి వెళ్ల‌గా, మీరు హౌస్ లోకి వెళ్ళాలి అంటే నాకు ఫేవర్ చేయాలి అంటూనే పక్కలో పడుకుంటే మీ పేరుని ఫైనల్ చేస్తా అన్నాడట. దీంతో బిత్తరపోయిన సదరు యూట్యూబర్ ఆఫర్‌ని రిజెక్ట్ చేసి ఇంటికి వ‌చ్చేసింద‌ట‌. అయితే ఆ యూట్యూబ‌ర్ ఈ విష‌యాన్ని త‌న స్నేహితుల‌తో షేర్ చేసుకోగా, ఇది బ‌య‌ట‌కు లీక్ అయి వైర‌ల్‌గా మారింది. గ‌తంలో కొంద‌రు కంటెస్టెంట్స్ కూడా తాము కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నామ‌ని చెప్పిన విష‌యం తెలిసిందే.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి