
Celebrities mourn the death of superstar Krishna
SuperStar Krishna : సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు ఉదయం తొలి శ్వాస విడవటం తెలిసిందే. కార్డియాక్ అరెస్ట్ తో నిన్న హైదరాబాద్ గచ్చిబౌలి లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో జాయిన్ కావడం జరిగింది. అప్పటికే ఆరోగ్యం విషమించటంతో శరీరంలోని ప్రధానమైన అవయవాలు ఏమి కూడా పనిచేయలేదు. దీంతో వెంటిలేటర్ పై ప్రపంచ స్థాయి వైద్యులతో చికిత్స అందించారు. అయినా గాని శరీరం స్పందించడం లేదని నిన్న వైద్యులు తెలియజేశారు. 48 గంటలు గడిస్తే గాని ఏమీ చెప్పలేము అని తెలిపారు. ఈ క్రమంలో కృష్ణ కోలుకోవాలని అభిమానులంతా భగవంతునికి ప్రార్ధనలు చేశారు.ఒకపక్క వైద్యులు మరోపక్క అభిమానులు చేసిన ప్రార్థనలు ఏవి కూడా ఫలించలేదు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కృష్ణ తుది శ్వాస విడిచారు. ఈ ఏడాది ప్రారంభంలో కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు తర్వాత ఆయన భార్య ఇందిరాదేవి మరణాల తరువాత కృష్ణా అనారోగ్యం పాలయ్యారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం మరింత క్షమించింది. కాగా నిన్న గుండె నొప్పితో హాస్పిటల్ లో జాయిన్ అయ్యి చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుది శ్వాస విడవటంతో ఇండస్ట్రీ వర్గాలు మరియు అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ క్రమంలో చాలామంది కుమారుడు మహేష్ బాబుకి ధైర్యంగా ఉండాలని ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోషల్ మీడియాలో కృష్ణ మరణం పై స్పందించారు.
Celebrities mourn the death of superstar Krishna
కృష్ణ గారు తెలుగువారి సూపర్ స్టార్. ఆయనే అల్లూరి… ఆయనే మన జేమ్స్ బాండ్. నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు. మహేష్ కు, కృష్ణగారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.. అని సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇంక చిరంజీవి, చంద్రబాబు, వెంకయ్య నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, హీరో నాని, రఘువీరారెడ్డి, బండ్ల గణేష్, సాయి ధరమ్ తేజ్, రాధిక శరత్ కుమార్… ఇంకా పలు రాజకీయ పార్టీల నాయకులు సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.