
chakrapani warns rajiv after he asks about vasudhara
Guppedantha Manasu : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 23 జనవరి, సోమవారం ఎపిసోడ్ 666 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వసుధార ఇంటికి రావడంతో దేవయాని, జగతి షాక్ అవుతారు. మళ్లీ నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి వసుధారను అక్కడి నుంచి పంపించేస్తారు. మరోవైపు రిషి కాలేజీలోనే ఉన్నాడని నీకు ఎవరు చెప్పారు అని మహీంద్రాను అడుగుతుంది దేవయాని. దీంతో వసుధార పెట్టిన వాయిస్ మెసేజ్ ను వినిపిస్తాడు. వసుధార.. మహీంద్రాకు తన బాధ్యతను గుర్తు చేస్తోందా? ఇంతమంది ఉన్నాం.. రిషిని పట్టించుకోవడం లేదని తన ఉద్దేశమా? చిన్నప్పుడు జగతి వదిలి వెళ్తే కంటికి రెప్పలా నేను రిషిని చూసుకున్నాను. ఇప్పుడు ఇదే జగతి తీసుకొచ్చిన వసుధార మన అందరి జీవితాలను అతలాకుతలం చేస్తోంది. దీనికి పరిష్కారం ఏంటో మీరే చెప్పాలి అంటుంది దేవయాని.
chakrapani warns rajiv after he asks about vasudhara
రిషి ప్రతిసారి మోసపోతూనే ఉన్నాడు అంటూ రిషి మీద కపట ప్రేమ చూపిస్తుంది దేవయాని. ఇంతలో రిషి ఫోన్ చేస్తాడు జగతికి. దీంతో చెప్పు రిషి అంటుంది. దీంతో మేడమ్ ఒకసారి మీరు కాలేజీకి రండి మాట్లాడాలి అంటాడు. వెంటనే పెట్టేస్తాడు. దీంతో రిషి కాలేజీకి రమ్మంటున్నాడు. నేను వెళ్తాను అంటుంది జగతి. దీంతో మేము కూడా వస్తాం అంటుంది దేవయాని. దీంతో ఎవరూ వద్దు.. నేను ఒక్కదాన్నే వెళ్లివస్తాను అని వెళ్తుంది జగతి. మరోవైపు చక్రపాణికి తన భార్య, కూతురు మీద చాలా ప్రేమ పుడుతుంది. తను చేసిన తప్పేంటో తెలుసుకుంటాడు. సుమిత్రను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఇంతలో రాజీవ్ ఫోన్ చేస్తాడు. దీంతో రాజీవ్ ను ఇష్టం ఉన్నట్టుగా తిడతాడు. ఒరేయ్.. నువ్వు మళ్లీ ఫోన్ చేస్తే నిన్ను చంపేస్తా అంటాడు చక్రపాణి.
దౌర్భాగ్యుడా అంటాడు. నా అల్లుడు దేవుడు అన్నారు కదా అంటాడు రాజీవ్. దీంతో నువ్వు పారిపోయి బతికిపోయావు. లేకపోతే నిన్ను అంటూ సీరియస్ అవుతాడు చక్రపాణి. మీరు నన్ను ఏం చేయలేరు మామయ్య గారు. ఎందుకంటే మీరు చాలా మంచి వారు అంటాడు రాజీవ్.
అసలే మీ ఆరోగ్యం బాగోలేదు. ఎందుకు అంతలా ఆవేశపడుతున్నారు. అత్తయ్య గారి ఆరోగ్యం ఎలా ఉంది మామయ్య గారు. అంతా ఓకే కదా అంటాడు. నీతో ఇంత సేపు మాట్లాడటం నాదే తప్పు అంటాడు. వసు ఎలా ఉంది అంటాడు. దీంతో నువ్వు ఇంకో మాట మాట్లాడితే బాగుండదు. నా కూతురును ఖచ్చితంగా నువ్వే చంపి ఉంటావు అంటాడు చక్రపాణి.
దీంతో ఇంకో కూతురును ఇవ్వండి మామయ్య గారు. వసును ఇచ్చి పెళ్లి చేయండి. గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అంటాడు రాజీవ్. దీంతో చంపేస్తాను. ఇంకోసారి నాకు ఫోన్ చేయకు అంటాడు చక్రపాణి. మళ్లీ నా కంటికి కనిపించేలా చేసినా.. వసు జోలికి వచ్చినా బాగుండదు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తాడు చక్రపాణి.
మరోవైపు పుష్ప వచ్చి రిషికి ఒక బాక్స్ ఇస్తుంది. ఇది వసుకు ఇవ్వమని చెబుతుంది. తన రూమ్ లోనే వసు ఉంటున్నట్టు చెప్పింది పుష్ప. త్వరలోనే తన నాన్న కూడా వస్తున్నట్టు చెబుతుంది. వాళ్ల ఆయన్ను నువ్వు చూశావా అంటే లేదు సార్ అంటుంది. కానీ.. లక్కీ ఫెలో కదా సార్.. వసుధార భర్త అంటుంది పుష్ప.
ఇంతలో జగతి వస్తుంది. జగతికి గౌతమ్ ఫ్లాట్ కీ ఇస్తాడు. ప్రాజెక్ట్ హెడ్ గా వసుదార ఉన్నందు వల్ల.. తన సౌకర్యాలు అన్నీ మనమే చూసుకోవాలి. వసును గౌతమ్ ఫ్లాట్ లో ఉండమని చెప్పి కీ ఇచ్చి అలాగే పుష్ప ఇచ్చిన బాక్స్ ను కూడా ఇచ్చి వసుకు ఇవ్వమని చెబుతాడు రిషి.
దీంతో ఎంత మంచి మనసు నీది అని అనుకుంటుంది జగతి. మరోవైపు వసుధార.. రిషి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో జగతి వచ్చి.. వసుకు కీ, బాక్స్ ఇస్తుంది. రిషి సార్ ఇచ్చారా? రిషి సార్ కు నా మీద ఎంత ప్రేమో. నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు అంటూ మురిసిపోతుంది వసు. మరోవైపు దేవయాని.. రాజీవ్ కు ఫోన్ చేసి అసలు నువ్వు ఏం చేస్తున్నావు. ఎక్కడున్నావు అంటూ సీరియస్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
Mana Shankara Vara Prasad Garu Box Office Collections : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎప్పుడూ…
Arava Sreedhar : జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై ఒక…
Ibomma Ravi : ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా కోట్లాది రూపాయలు గడించిన రవి, కేవలం ఒక సాధారణ పైరేట్ మాత్రమే…
This website uses cookies.