
will divya be saved from karthik and his friend
Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 23 జనవరి, 2023, సోమవారం ఎపిసోడ్ 849 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దివ్య కనీసం ఎక్కడికి వెళ్తుందో.. ఏ పార్టీకి వెళ్తుందో చెప్పిందా అంటే.. దివ్య షేర్ చేసిన లొకేషన్ గురించి చెబుతుంది. దీంతో ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా అంటాడు ప్రేమ్. వెంటనే ఆ లొకేషన్ ను తీసుకొని నందు, తులసి, ప్రేమ్ బయలుదేరుతారు. మరోవైపు దివ్య త్వరగానే తనను ఇంటికి తీసుకెళ్లు అంటుంది దివ్య. కానీ.. రూట్ మార్చి తనను తీసుకెళ్తున్నట్టు తెలుసుకొని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటుంది. దీంతో ఏం లేదు దివ్య. ఇప్పుడే ఇంటికి వెళ్లి ఏం చేస్తావు అంటాడు కార్తీక్. వద్దురా.. దివ్య భయపడుతోంది అని చేతన్ చెప్పినా కూడా వినడు కార్తీక్. ప్లీజ్ దివ్య నా మాట విను అంటూ తన నోరు మూస్తాడు. మనం ఫ్రెండ్స్ కదా అన్నా కూడా కార్తీక్ వినడు.
will divya be saved from karthik and his friend
మరోవైపు బర్త్ డే పార్టీ జరిగిన ప్లేస్ కు వస్తారు తులసి, ప్రేమ్. అక్కడ ఉన్న వాచ్ మెన్ తో మాట్లాడుతారు. ఎవరైనా ఉన్నారా అంటే.. అందరూ పార్టీ అయిపోయాక వెళ్లిపోయారు అంటాడు. దీంతో దివ్య ఫోటోను కూడా చూపిస్తాడు ప్రేమ్. దీంతో చూశాను సార్. అందరికంటే చివరగా వెళ్లింది. మత్తుగా ఉన్నట్టు కూడా అనిపించింది అంటాడు. దీంతో సరిగ్గా చూసి చెప్పు అంటుంది తులసి. దీంతో సరిగ్గానే చూశాను మేడమ్.. ఇద్దరు కుర్రాళ్లు ఆమెను ఎక్కించుకొని తీసుకెళ్లారు అంటాడు వాచ్ మెన్. దీంతో కారు నెంబర్ తెలుసా? వాళ్లు ఎవరో తెలుసా అని అడుగుతారు. దీంతో తెలియదు అంటాడు వాచ్ మెన్. ఇంతలో నందు వస్తాడు. పోలీస్ కంప్లయింట్ ఇద్దామా అంటాడు ప్రేమ్. వద్దు అంటుంది. ఎక్కడైనా వెతుకుదాం అంటుంది తులసి.
ఆడపిల్లకు ఎందుకురా ఈ కష్టాలు. ఆడపిల్ల అంటేనే ఎందుకురా ఈ చులకన అంటుంది తులసి. మరోవైపు దివ్య అరుస్తుంటే.. అరవకు. నిన్ను మీ ఇంటి దగ్గరే దింపేస్తాంలే అంటాడు కార్తీక్. మరోవైపు అందరూ దివ్య కోసం టెన్షన్ పడుతూ ఉంటారు. నాకు భయంగా ఉందండి.. ఇన్నిసార్లు ఇంతమంది ఫోన్ చేశాం కానీ.. కనీసం మెసేజ్ కూడా పెట్టలేదు అంటుంది అనసూయ.
ఇంట్లో వాళ్లంతా టెన్షన్ పడుతుంటే.. వెంటనే నందుకు ఫోన్ చేస్తుంది లాస్య. దీంతో దివ్య నువ్వు ఇచ్చిన అడ్రస్ లో లేదు. పార్టీ ఎప్పుడో అయిపోయిందట. వాచ్ మెన్ తప్పితే ఎవ్వరూ లేరు అక్కడ. ఎవరో ఇద్దరు కుర్రాళ్లు తీసుకెళ్లారట. అందరం తలోపక్క వెతుకుతున్నాం అంటాడు నందు.
అయిపోయింది.. నా మనవరాలు జీవితం మొత్తం నాశనం అయింది అని అంటూ ఏడుస్తుంది అనసూయ. మరోవైపు తన ఫ్రెండ్ రామారావుకు ఫోన్ చేసి ఏదైనా హెల్ప్ తీసుకో అని చెబుతుంది లాస్య. దీంతో వెంటనే రామారావుకు ఫోన్ చేస్తాడు. మరోవైపు దివ్యకు అబద్ధం చెప్పి తన రూమ్ కు తీసుకొస్తాడు కార్తీక్.
నువ్వు ఇంకా మారాలి దివ్య. నువ్వు అర్థం చేసుకోవడం లేదు. నువ్వు అరిస్తే మా పరువు మాత్రమే కాదు. నీ పరువు కూడా పోతుంది.. అంటాడు కార్తీక్. ఒక్కసారి ఇందాకటి పార్టీ మూడ్ ను గుర్తు తెచ్చుకో అంటాడు కార్తీక్. దగ్గరికి రావద్దు కార్తీక్ అంటుంది దివ్య.
చేతన్ కూడా తప్పు చేస్తున్నట్టు అనిపిస్తోందిరా. దివ్యను వదిలేద్దాం అంటే.. ఏంట్రా వదిలేది. ఇంత కష్టపడి ప్లాన్ వేసింది వదిలేసేందుకు కాదు అంటాడు కార్తీక్. మరోవైపు ప్రేమ్ కు శృతి కాల్ చేస్తుంది. దీంతో ఇంకా దొరకలేదు అని అంటాడు ప్రేమ్. ఇంతలో తులసికి ఒక ఐడియా వస్తుంది.
తన దగ్గర ఫోన్ ఉంది కదా. ఆ ఫోన్ లో ఉండే జీపీఎస్ తో ట్రేస్ చేయొచ్చు కదా అంటుంది. దీంతో అవును అని వెంటనే తన ఫోన్ లో దివ్య జీపీఎస్ చెక్ చేసి అక్కడికి వెళ్తారు ఇద్దరూ. ఆ తర్వాత ఏ జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.