Jabardasth Chalaki Chanti : రీతూ, అజర్ పరువుపాయే..దారుణంగా సెటైర్ వేసిన చలాకీ చంటి
Jabardasth Chalaki Chanti : బుల్లితెరపై రొమాంటిక్ ట్రాకులు వేస్తేనే టీఆర్పీ రేటింగ్లు వస్తున్నాయని, తమకు రీచ్ వస్తుందని జబర్దస్త్ కంటెస్టెంట్లు ఫీలవుతున్నట్టున్నారు. అందుకే ఎవరో ఒకరిని తగులుకుంటున్నారు.. తమ మధ్య ఏదో ఉందని భ్రమపడేలా చేస్తున్నారు. కలిసి స్కిట్లు వేస్తున్నారు. ఇక స్కిట్లు పండేందుకు రకరకాల వ్యయప్రయాసాలకు లోనవుతున్నారు. ప్రోమోల్లో పడాలని పిచ్చి పిచ్చి వేషాలు కూడా వేస్తుంటారు.ఇక ఈ మధ్య ఆది జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.
గత నెల రోజులకు పైగా ఆది స్కిట్లు జబర్దస్త్ షోలో కనిపించడం లేదు. దీంతో ఓ టీం తక్కువైంది. అందుకే అజర్ లాంటి వ్యక్తికి కూడా ఓ టీం పెట్టేసి.. టీం లీడర్‌ని చేసేశారు. కానీ అజర్ మాత్రం పొడిచిందేమీ లేదు. రీతూతో పులిహోర కలుపుకుంటూ స్కిట్లు చేసుకుంటూ పోతోన్నాడు. అయితే రీతూతో ఎంత స్కిట్లు చేసినా కూడా పేలడం లేదు.మరీ నాసిరకంగా ఉన్నాయంటూ జనాలు చెప్పేస్తున్నారు. యూట్యూబ్‌లో అజర్ స్కిట్ల కింద దారుణమైన కామెంట్లు కనిపిస్తున్నాయి.

Chalaki Chanti satires on azar and ritu chowdhary in extra jabardasth
అయితే తాజాగా చలాకీ చంటి కూడా రీతూ, అజర్ మీద సెటర్ వేసేశాడు. గత వారంలో అజర్, రీతూ కలిసి ఓస్కిట్ చేశారు. స్కిట్ పూర్తయిన తరువాత రోజా అడిగిన ప్రశ్నకు రీతూ కాస్త ఓవర్ యాక్షన్ చేసింది. అజర్ గురించి చెబుతూ రీతూ ఎమోషనల్ అయింది.చివరకు అజర్‌ను హగ్ చేసుకుంది రీతూ. దీనిపై చలాకీ చంటి తన స్కిట్లో కౌంటర్లు వేశాడు. రీతూ, అజర్‌ని ఇమిటేట్ చేస్తూ చలాకీ చంటి రెచ్చిపోయాడు. మొత్తానికి ఇలా తమలో తామే ఇమిటేషన్లు చేసుకుంటూ పరువు తీసేసుకుంటున్నారు.
