Chalaki Chanti : నా పొట్ట కొట్టిన వాళ్లు నాశనం అవుతారు.. వారంతా నాశనమైపోతారంటూ చంటి సంచలన వ్యాఖ్యలు
ప్రధానాంశాలు:
Chalaki Chanti : నా పొట్ట కొట్టిన వాళ్లు నాశనం అవుతారు.. వారంతా నాశనమైపోతారంటూ చంటి సంచలన వ్యాఖ్యలు
Chalaki Chanti : చలాకీ చంటి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. జబర్ధస్త్ షోతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న చంటి పలు సినిమాలలో కూడా నటించాడు. చలాకి చంటి అంటేనే పేరులోనే చలాకీతనం కనిపిస్తుంది. జబర్దస్త్ ద్వారా ఒక వెలుగు వెలిగిన చలాకి చంటి..గత కొద్ది కాలంగా బుల్లితెరకు, అటు వెండితెరకు దూరమయ్యాడు. అసలు చలాకీ చంటికి ఏమైంది..? ఎప్పుడూ తనదైన స్టైల్ లో పంచులు వేస్తూ నవ్వుతూ నవ్విస్తూ కనిపించే చలాకీ చంటి ఏమైపోయాడు అని ఫ్యాన్స్ చాలా కాలంగా వెతుకుతున్నారు.జబర్దస్త్ తో పాటు కొన్ని కామెడీ షోలు ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టాయి.
Chalaki Chanti వాళ్లకి అదే నా శాపం..
అలాంటి చంటీ ఆ మధ్య తీవ్రమైన అనారోగ్యానికి లోనయ్యాడు. ఆ తరువాత నుంచి ఆయన కోలుకుంటూ వస్తున్నాడు. తాజాగా ఐడ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంటీ మాట్లాడుతూ . “ఆ మధ్య నేను హాస్పిటల్ పాలైనప్పుడు ఒకరిద్దరు తప్పా, ఎవరూ కూడా నన్ను పలకరించలేదు. అంతకుముందు వరకూ నాతో ఉన్నవారు ఆ సమయంలో కనిపించలేదు” అన్నాడు. ” నన్ను చూసిన వాళ్లంతా బాగా సంపాదిస్తున్నాడని అనుకుంటారు. కానీ అలా కనిపించకపోతే ఇక్కడ ఎవరూ పట్టించుకోరు .. ఎవరూ దేనికీ పిలవరు. అందువలన కష్టమైనా .. నష్టమైనా మెయింటైన్ చేయాలి. అలా చేయడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి.

Chalaki Chanti : నా పొట్ట కొట్టిన వాళ్లు నాశనం అవుతారు.. వారంతా నాశనమైపోతారంటూ చంటి సంచలన వ్యాఖ్యలు
ఇక్కడ ఎవరైనా సరే నువ్వు బాగుంటేనే ‘బాగున్నావా’ అని అడుగుతారు. బాగోలేకపోతే కనిపించకుండా పోతారు. ఇది కలియుగం .. ఇక్కడ ఎవరినీ నమ్మడానికి లేదు .. ఎవరిపై ఆశలు పెట్టుకోకూడదు” అని చెప్పాడు. “నాకు ఇగో ఎక్కువనీ .. షూటింగుకు వస్తే నేను చాలా అడుగుతానని కొంతమంది ప్రచారం చేశారు. కొంతమంది నాకు సంబంధంలేని విషయాల్లో నన్ను ఇరికించారు. నాకు రావలసిన అవకాశాలు రాకుండా ఆపేశారు. అలాంటి వాళ్లంతా సర్వనాశనమై పోతారు .. వాళ్లందరికీ ఇదే నా శాపం. ప్రత్యక్షంగా గానీ .. పరోక్షంగా గాని నాకు చెడు చేయడానికి ప్రయత్నించిన వాళ్లంతా నాశనమైపోతారు. అలా జరగాలని దేవుడిని రోజుకి వందసార్లు కోరుకుంటున్నా. డబ్బు లేకపోతే మనిషి జీవితం వృధా అని కామెంట్ చేశారు చంటి.