Unstoppable 2 : చంద్రబాబు ఎపిసోడ్ లో అన్ స్టాపబుల్ లో బాలయ్య అడిగిన ఫస్ట్ ప్రశ్న ఇదే – ఫుల్ కాంట్రవర్సీ

Authored By Jagadesh Gatla | The Telugu News | Published on: October 12, 2022, 12:00 pm

Unstoppable 2 : ఆహాలో అన్ స్టాపబుల్ అనే షో ఎంత సక్సెస్ అయిందో తెలుసు కదా. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వచ్చిన ఈ షో సూపర్ డూపర్ సక్సెస్ అయింది. అందుకే అన్ స్టాపబుల్ 2 పేరుతో మరో సీజన్ ను తీసుకొస్తున్నారు. అయితే.. ఈసారి ఈ షో మామూలుగా ఉండదు అట. అసలు ఈ షోకు వచ్చే అతిథులు కూడా మామూలు వాళ్లు ఉండరు. సినీ సెలబ్రిటీలతో పాటు ఇతర రంగాల్లో రాణించిన వాళ్లను కూడా పిలిచి వాళ్లతో బాలకృష్ణ ఇంటర్వ్యూ చేయనున్నారు. ఇప్పటికే అన్ స్టాపబుల్ 2 షో కు సంబంధించిన పలు ఎపిసోడ్స్ ఇంటర్వ్యూ కూడా పూర్తయిందట.

అక్టోబర్ 14 న సీజన్ 2 గ్రాండ్ గా లాంచ్ కానున్న విషయం తెలిసిందే. అయితే.. అన్ స్టాపబుల్ 2 షోకు మొదటి ఎపిసోడ్ కు ఫస్ట్ గెస్టులు ఎవరో తెలుసా? రాజకీయాల్లో ఆరితేరిన ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు, ఆయన కొడుకు నారా లోకేశ్. అక్టోబర్ 14న వీళ్ల ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవనుంది. తాజాగా చంద్రబాబు, లోకేశ్ తో బాలయ్య బాబు చేసిన మొదటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ప్రోమోలో చంద్రబాబుకు సంబంధించిన చాలా విషయాలను, 1995 లో జరిగిన విషయాన్ని కూడా బాలకృష్ణ.. చంద్రబాబును అడిగారు. చంద్రబాబు స్టూడెంట్ గా ఉన్నప్పుడు చేసిన అల్లరి పనుల గురించి కూడా బాలకృష్ణ అడిగారు.

chandrababu and nara lokesh are the first guests in unstoppable season 2

chandrababu and nara lokesh are the first guests in unstoppable season 2

Unstoppable 2 : చంద్రబాబు ఎపిసోడ్ ప్రోమో విడుదల

ఆ తర్వాత నారా లోకేశ్ రాగానే మంగళగిరిలో ఓడిపోయిన విషయం గురించి అడిగాడు. ఆ తర్వాత కొంత సేపు లోకేశ్ హోస్ట్ అయ్యాడు. బాలకృష్ణ గెస్ట్ అయ్యాడు. అప్పుడు లోకేశ్ కూడా వాళ్లను కొన్ని ప్రశ్నలు అడిగాడు. మొత్తం మీద మొదటి ఎపిసోడే బ్లాస్ట్ అయ్యేలా ఉంది. నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ అయితే మొదటి సీజన్ తో పోల్చితే డబుల్ అయింది. ప్రస్తుతం బాలకృష్ణ గోపిచంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ మరోసినిమా చేయనున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ కు హోస్ట్ గానూ వ్యవహరించనున్నారు.

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

  1. "November Box Office : నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ వద్ద రక్తపాతం.. క్రేజీ సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఫిక్స్..!"

  2. "Prabhas Imanvi : ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఇన్ని రకాల వంటకాలా..!"

  3. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  4. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  5. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  6. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  7. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp