Home » Entertainment » Chandramukhi In Bigg Boss 6 Telugu
Entertainment

Bigg Boss 6 Telugu : హిజ్రాల జాబితాలో బిగ్ బాస్ సీజ‌న్ 6లో పాల్గొనే కంటెస్టెంట్ ఎవ‌రో తెలిస్తే నోరెళ్ల‌పెట్టాల్సిందే..!

Authored By
Sam C
The Telugu News | Published on: January 26, 2022, 11:45 am
Advertisement

Bigg Boss 6 Telugu : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్య‌క్ర‌మం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో స‌క్సెస్ ఫుల్‌గా సాగుతున్న ఈ షో తెలుగులో ఐదు సీజ‌న్స్ పూర్తి చేసుకొని ఆరో సీజ‌న్‌లోకి అడుగుపెట్ట‌బోతుంది. అయితే సీజ‌న్ 3 నుండి హౌజ్‌లోకి ఓ ట్రాన్స్‌జెండ‌ర్‌ని కంటెస్టెంట్‌గా తీసుకొస్తున్నారు. సీజ‌న్ 3లో త‌మ‌న్నా సంద‌డి చేయ‌గా, సీజ‌న్ 4లో ప్రియాంక సింగ్ అడుగుపెట్టింది. తమన్నా.. ప్రవర్తనతో ట్రాన్స్ జెండర్స్‌పై నెగిటివిటీ పెరిగితే.. ప్రియాంక మాత్రం 13 వారాలు పాటు బిగ్ బాస్ హౌస్‌లో ఉండి వారిపై గౌరవం పెరిగేలా ప్ర‌వ‌ర్తించింది. అయితే సీజ‌న్ 6లో ట్రాన్స్‌జెండ‌ర్‌గా ఎవ‌రు వ‌స్తారు అనే దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుంది.

Advertisement

తాజ‌గా స‌మాచారం ప్ర‌కారం హిజ్రా ఫౌండర్, స్పోక్ పర్సన్ చంద్రముఖి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లబోతుందనే వార్తలు ఊపందుకున్నాయి. త్వరలో బిగ్ బాస్ ఓటీటీ తెలుగు ప్రసారం కాబోతున్న నేపథ్యంలో చంద్రముఖికి బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి కాల్ వచ్చిందని.. అయితే ఆమె ఓటీటీకి కాకుండా సీజన్ 6కి వెళ్లడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా దీనిపై చంద్ర‌ముఖి స్పందించింది‘నేను బిగ్ బాస్ హౌస్‌లో ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటే తప్పకుండా వెళ్తాను. నా ఇన్‌స్టాగ్రామ్‌లో.. ఫేస్ బుక్‌లో చాలామంది అడుగుతుంటారు.. అక్కా బిగ్ బాస్ షోకి వెళ్లొచ్చు కదా అని. నిజానికి బిగ్ బాస్ సీజన్ 3కి నన్ను అప్రోజ్ అయ్యారు. ఆ టైంలో నా పరిస్థితి బాలేదు..

chandramukhi in bigg boss 6 telugu

Advertisement

Bigg Boss 6 Telugu : సీజ‌న్ 6లో పాల్గొనేందుకు సిద్ద‌మైన హిజ్రా

డిప్రెషన్‌లోకి వెళ్లి హాస్పటల్‌లో చేరాను. అలా బిగ్ బాస్ ఛాన్స్ మిస్ అయ్యింది. బిగ్ బాస్ 6లో ఛాన్స్ వస్తే వెళ్తాను. రాకపోయినా బాధపడను. నా నుంచి చాలా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. చంద్రముఖి అక్క నువ్ డిక్షనరీ.. తప్పకుండా బిగ్ బాస్‌ 6కి వెళ్లాలని అంటున్నారు. అందుకే బిగ్ బాస్ షోకి వెళ్లడానికి చాలా హోప్స్ ఉన్నాయి. బిగ్ బాస్ 6కి నేను వెళ్తే కనుక.. మా కమ్యునిటీ పేరు వచ్చేట్టు చేస్తాను. మిగిలిన వాళ్లనా నేను ఉండను అంటూ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది చంద్ర‌ముఖి. మ‌రి ఈ కామెంట్స్ తో చంద్ర‌ముఖికి బిగ్ బాస్ వారి నుండి ఏదైన కాల్ వ‌స్తుందా అనేది చూడాలి..!

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి