Janaki Kalaganaledu 26 Jan Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు జనవరి 26, 2022, బుధవారం ఎపిసోడ్ 223 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సంక్రాంతి సంబురాల్లో భాగంగా ఆత్రేయపురం గుడిలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తారు. దీంతో మల్లిక, జానకితో పాటు జ్ఞానాంబ కూడా ముగ్గుల పోటీలో పాల్గొంటుంది. మరోవైపు సునంద కూడా ముగ్గుల పోటీలో పాల్గొంటుంది. ఇంతలో సునంద పెట్టిన కిరాయి రౌడీ రామా బైక్ కు బాంబు ఏర్పాటు చేస్తాడు. మరోవైపు అందరి ముగ్గులు వేయడం పూర్తవుతూ ఉంటుంది. ముగ్గు వేయకుండా మల్లిక ఏదో ఒకటి వాగుతూ ఉంటుంటే.. విష్ణు నవ్వుతుంటాడు. నవ్వు నవ్వు.. నాకు బహుమతి వచ్చాక అప్పుడు తెలుస్తుంది అందరికీ అంటుంది. దీంతో జ్ఞానాంబ మల్లికపై సీరియస్ అవుతుంది. ఏంటి ఆ అరుపులు.. ముందు ముగ్గేయ్ అంటుంది.
జానకి బాగా ముగ్గు వేస్తుంది అని గోవిందరాజు అంటాడు. దీంతో తనకు మనమే కదా నేర్పించింది అంటాడు రామా. కోడలుకు ముగ్గులేయడం నువ్వు నేర్పించావా అంటాడు గోవిందరాజు. అంటే.. మెళకువలు నేర్పించాను అని అంటాడు రామా. ఓహ్.. మెళకువలా అర్థం అయింది అని అంటాడు గోవిందరాజు. చూస్తూ ఉంటే నాకెందుకో జానకికే ఫస్ట్ ఫ్రైజ్ వస్తుంది అనిపిస్తుంది అంటాడు గోవిందరాజు. లేదు.. అత్తయ్య గారి ముగ్గు బాగుంది. అత్తయ్య గారికే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అంటుంది జ్ఞానాంబ. వదిన.. కాంపిటిషన్ అమ్మ, నీమధ్యే ఉంది కానీ.. ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుందేమో అనిపిస్తుందిచ అంటుంది. అన్నయ్య నువ్వు చెప్పు అని అందరూ రామాను అడుగుతారు. దీంతో ఏం చెప్పాలో అర్థం కాదు రామాకు. ఈ ముగ్గు బాగుంది.. ఆ ముగ్గూ బాగుంది.. అంటాడు. చివరకు జానకి గారు వేస్తున్న ముగ్గు సూపరో సూపర్ అంటాడు. కానీ.. మా అమ్మ వేస్తున్న ముగ్గు అంత కన్నా సూపర్ అంటాడు రామా.
అందుకని ఫస్ట్ ప్రైజ్ మా అమ్మకే. ఇందులో ఎలాంటి అనుమానం లేదు అంటాడు రామా. నాన్నా.. ఎవరు గెలిస్తే ఏముందిరా.. నా కోడలు గెలిస్తే అది నేను గెలిచినట్టు కాదా అంటుంది జ్ఞానాంబ. అది మా అమ్మ అంటే అంటాడు రామా.
ఎవ్వరికి వాళ్లు తెగ పర్ ఫార్మెన్స్ చేస్తున్నారు. ఒక్కరు కూడా నన్ను పొగడటం లేదు. నన్ను పొగడొచ్చు కదా అని అనుకుంటుంది మల్లిక. కనీసం మా ఆయన కూడా నన్ను పొడగటం లేదు అని అక్కడ ఉన్న గిన్నెను తీసి విష్ణు వైపు కొడుతుంది. ఏంటి అని అంటాడు. దీంతో నా ముగ్గు కూడా పొగడొచ్చు కదా అంటుంది.
దీంతో ఆహా.. సూపర్.. నీ ముగ్గు అద్భుతంగా ఉంది. నాకు తెలిసి ప్రపంచంలో ఇలా ఎవ్వరూ వేయరు అనుకో.. అంటాడు విష్ణు. మీరు మరీ అంతలా పొగడకండి.. అంటుంది మల్లిక. ఒరేయ్ విష్ణు. నీ మీదికి గిన్నె విసరడం మేము చూశాం కానీ.. ఇక నువ్వురా ఇటు అంటాడు గోవిందరాజు.
ఈసారి నువ్వు కోడలు చేతిలో ఓడిపోయేలా తప్పేది లేదు అంటుంది గోవిందరాజు. పర్వాలేదు లేండి. కోడలు చేతిలో ఓడిపోవడం కూడా ఒకరకంగా గెలుపే. అది చాలా గర్వంగా కూడా ఉంటుంది అంటుంది జ్ఞానాంబ. దీంతో లేదు అత్తయ్య గారు మీరు ఖచ్చితంగా గెలుస్తారు.. చూస్తూ ఉండండి అంటుంది జానకి. నా చేతిలో మీరిద్దరూ ఓడిపోతారు చూస్తూ ఉండండి అని చెప్పి తన దగ్గర ఉన్న ప్లాస్టిక్ బల్లిని జానకి మీదికి విసిరేస్తుంది మల్లిక.
దాన్ని తీసి పక్కన పడేస్తుంది జానకి. జానకిని ఎలా ఓడించాలి అని ప్లాన్ వేస్తూ ఉంటుంది మల్లిక. ఏంటి జానకి రంగులు ఏవైనా కావాలా అని అడుగుతుంది మల్లిక. అవసరం లేదులే జానకి. మనం ఇంటికి వెళ్లాక మాట్లాడుకుందాం కానీ.. ముందు నువ్వు నీ దృష్టి ముగ్గు మీద పెట్టు అంటుంది జానకి.
ముగ్గులు వేయడం పూర్తయ్యాక.. ఎమ్మెల్యే మధులత వచ్చి అందరి ముగ్గులు చెక్ చేస్తూ ఉంటుంది. ఇంతలో జానకి తన ముగ్గును కొంచెం చెడిపేస్తుంది. తను చెడిపేయడం గోవిందరాజు చూస్తాడు. మీరు వేసిన ముగ్గు చాలా చాలా బాగుంది. రంగులకు కూడా ఇంత సహజత్వం ఉంటుందా అన్నట్టుగా వేశారు. రంగుల పోటీలో మొదటి బహుమతి మీకే అంటుంది ఎమ్మెల్యే.
కాకపోతే ముగ్గు చివర్లో ఫినిషింగ్ అంతగా బాగోలేదు అంటుంది ఎమ్మెల్యే. వెంటనే అక్కడి నుంచి జ్ఞానాంబ దగ్గరికి వచ్చి జ్ఞానాంబ గారికి మొదటి బహుమతి ప్రకటిస్తున్నాం అంటుంది ఎమ్మెల్యే. దీంతో అందరూ ఖుషీ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.