Charmi Kaur : గట్టిగా ఫిక్స్ అయినట్టుంది.. ఛార్మీ కష్టాలు మామూలుగా లేవు!!

Authored By Cinema Desk | The Telugu News | Updated on: January 5, 2021, 12:04 pm

ఒకప్పుడు తన అందంతో, నటనతో ప్రేక్షకులను కట్టి పడేసింది ఛార్మీ. ముద్దుగుమ్మ ఛార్మీ అప్పట్లో యూత్‌కు ఫేవరేట్ హీరోయిన్‌గా ఉండేది. ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది కాలంలోనే మంచి స్టార్డంను సంపాదించుకుంది. అతి తక్కువ కాలంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అయితే ఆక్రేజ్ ఎక్కువగా కాలం పాటు పనిచేయలేదు. వరుసగా ఆమె హీరోయిన్‌గా నటించిన చిత్రాలన్నీ బెడిసి కొట్టాయి. దీంతో ఆమెకు వెండితెరపై అవకాశాలు తగ్గాయి. చివరగా జ్యోతిలక్ష్మీ సినిమాతో కనిపించింది.

Charmi Kaur Workout pics goes viral

Charmi Kaur Workout pics goes viral

ఆ తరువాత ఛార్మీ మళ్లీ తెరపై కనిపించలేదు. ఇప్పుడు మాత్రం నిర్మాతగా మారి పూరి జగన్నాథ్ వ్యవహారాలను చూసుకుంటోంది. పూరి కనెక్ట్స్ అంటూ పీసీ బ్యానర్‌ బాధ్యతలను తీసుకుంది. అలా పూరి తెరకెక్కించే సినిమా వ్యవహారాలన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటుంది. అయితే ఛార్మీ మాత్రం ఈ కొత్త ఏడాదికి మంచి ప్లాన్ వేసినట్టుంది. కొన్ని పనులు చేయాలని గట్టిగా తీర్మానించుకున్నట్టుంది. ఈ ఏడాది మొదటి రోజు నుంచే తీవ్రంగా శ్రమిస్తూ వస్తోంది.

ఛార్మీ ఈ మధ్య భారీగా లావు ఎక్కింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఈ కొత్త ఏడాదిలో రోజూ వర్కవుట్లు చేయాలని రెజల్యూషన్ తీసుకున్నట్టుంది. అందుకే ఈ మేరకు ప్రతీ రోజూ ఉదయం పూట జిమ్‌లో తెగ కష్టపడుతోంది. అయితే సోమ వారం వస్తే అందరికీ కాస్త బద్దకం వస్తుంది. జిమ్‌లో ఒళ్లు వంచడానికి అంతగా ఇష్టపడరు. కానీ ఛార్మీ మాత్రం ఎంతో హుషారుగా ఎంట్రీ ఇచ్చింది. వర్కవుట్లు చేస్తూ పుల్ జోష్‌లో ఉంది. అయితే ఉదయమంతా బిజీగా ఉండటంతో రాత్రిపూట జిమ్ చేశానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఛార్మీ ఫైటర్ సినిమా పనుల్లో బిజీగా ఉంది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp