Chelleli Kaapuram 26 Nov Today Episode : వర్షం తండ్రి ఆకాశే అనే నిజం.. భూమి ఆకాశ్ కు చెబుతుందా? ఆకాశ్ గతం గురించి భూమిని ఎందుకు అడిగాడు?
Chelleli Kaapuram 26 Nov Today Episode : చెల్లెల్లి కాపురం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 26 నవంబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆకాశ్.. భూమిని తన గతం గురించి అడుగుతాడు. భూమి గారు.. నేను గతం మరిచిపోయినప్పుడు ఎలా ఉండేవాడిని అని అడుగుతాడు. నేను ఎలా ఉండేవాడినో కాస్త చెబుతారా అని అడుగుతాడు. దీంతో భూమి షాక్ అవుతుంది. ఎందుకంటే.. డాక్టర్.. ఆకాశ్ కు ఆ విషయాలు చెప్పకూడదని చెబుతాడు.భూమి గారు ఏమైంది అంటాడు. నేను అడిగిన దానికి మీరు ఏం సమాధానం చెప్పడం లేదు అంటే.. భూమి ఏం మాట్లాడదు. ఇప్పుడు గతం తెలుసుకొని ప్రయోజనం ఏముంది చెప్పండి అంటుంది భూమి.

chelleli kaapuram 26 november 2021 full episode
కానీ.. మీరు చెప్పీ చెప్పకుండా కొన్ని కొన్ని విషయాలు చెబుతుంటే తెలుసుకోవాలని అనిపిస్తోంది అంటాడు ఆకాశ్. ఆ సమయంలో నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టానా.. అందరూ నన్ను భరించి ఉంటారు. ముఖ్యంగా మీరు.. నన్ను చాలా బాగా చూసుకున్నారు.. అంటాడు ఆకాశ్.కట్ చేస్తే ఆకాశ్, భూమి ఇద్దరూ హాస్పిటల్ కు వెళ్తారు. పాపకు టీకా కోసం వెళ్తారు. భూమి గారు మీరు వెళ్లి ఫామ్ ఫిలప్ చేయండి. పాపను ఇవ్వండి. నేను చూసుకుంటాను అని చెబుతాడు ఆకాశ్. దీంతో భూమి వెళ్లి ఫామ్ అడుగుతుంది కానీ.. ఫామ్ అయిపోయాయి అంటారు.
ఫామ్ నింపి భూమి ఆకాశ్ దగ్గరికి వస్తుంది. ఆ పాప ఎవరు అని పక్కన ఉన్న వ్యక్తి అడుగుతాడు. దీంతో ఆ పాప.. ఆవిడ పాప అంటాడు. ఆ పాప ఎవరి పాప అయినా సరే.. పోలికలు మాత్రం అచ్చుగుద్దినట్టు మీవే ఉన్నాయి అంటాడు. దీంతో భూమి షాక్ అవుతుంది.
Chelleli Kaapuram 26 Nov Today Episode : తండ్రిగా వర్షం కోసం సంతకం పెట్టిన ఆకాశ్
తర్వాత ఫామ్ నింపి వస్తుంది భూమి. పాపను తీసుకెళ్లి టీకా వేయించుకొస్తుంది భూమి. ఆకాశ్ ను పిలిచి.. భూమి సంతకం చేయలేదు. మీరు చేయండి అని అంటారు. దీంతో సరే.. అని గార్డియన్ ప్లేస్ లో సంతకం చేయబోతాడు. ఇంతలో తన తమ్ముడు ఫోన్ చేస్తాడు. గార్డియన్ ప్లేస్ లో కాకుండా.. తండ్రి ప్లేస్ లో సంతకం చేస్తాడు.అదేంటి.. ఫాదర్ ప్లేస్ లో సైన్ తీసుకున్నారు అంటే.. అదేంటి.. పాప ఫాదర్ మీరు కాదా అంటుంది నర్స్. అదేంటి.. మేడం మీరు ఇద్దరు కలిసే వచ్చారు కదా అంటుంది నర్సు. మీ పేరు ఆకాశే కదా అంటుంది నర్సు.
మరి ఫాదర్ కాదంటారేంటి.. ఇందాక మేడమ్.. పాప ఫాదర్ పేరు అంటూ ఏదో అనబోయేసరికి.. భూమి వచ్చి గొడవ ఆపుతుంది.దీంతో నర్సు షాక్ అవుతుంది. ఫామ్ లో తండ్రి పేరు ఆకాశ్ అని నింపుతుంది భూమి. ఆ విషయం ఆకాశ్ కు తెలియదు. వాక్సిన్ అయిపోయాక.. ఇద్దరూ కలిసి కారులో బయలుదేరుతారు. మధ్యలో హోటల్ వద్ద కారు ఆపుతాడు ఆకాశ్. పాపను ఎత్తుకొని ముద్దాడుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.