Couple Friendly Movie Review : క‌పుల్ ఫ్రెండ్లీ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!

 Authored By ramu | The Telugu News | Updated on :13 February 2026,11:51 pm

ప్రధానాంశాలు:

  •  Couple Friendly Movie Review : క‌పుల్ ఫ్రెండ్లీ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!

Couple Friendly Movie Review : ప్రముఖ నిర్మాణ సంస్థ UV Creations సమర్పణలో రూపొందిన తాజా యూత్‌ఫుల్ లవ్ & ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కపుల్ ఫ్రెండ్లీ ప్రేమికుల దినోత్సవాన్ని టార్గెట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు రానుంది. అజయ్ కుమార్ పి నిర్మించిన ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. యువ హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ మానస వారణాసి జంటగా నటించిన ఈ సినిమాలో రాజీవ్ కనకాల , యోగిబాబు, గోపరాజు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఈ చిత్రానికి దినేష్ పురుషోత్తం సినిమాటోగ్రఫీ అందించగా, ఆదిత్య రవీంద్రన్ సంగీతం సమకూర్చారు. ఎడిటింగ్ బాధ్యతలను గణేష్ శివ నిర్వర్తించారు. మైఖేల్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ను, దినేష్ మనోహరన్ కాస్ట్యూమ్ విభాగాన్ని పర్యవేక్షించారు. ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి.

Couple Friendly Movie Review : క‌పుల్ ఫ్రెండ్లీ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!

Couple Friendly Movie Review : క‌పుల్ ఫ్రెండ్లీ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!

Couple Friendly Movie Review : సంతోష్ శోభ‌న్ ఖాతాలో మ‌రో హిట్ గ్యారెంటీనా..?

Couple Friendly Movie కథ విషయానికి వస్తే.. ఇంటీరియర్ డిజైనర్‌గా స్థిరపడేందుకు ప్రయత్నించే శివ (సంతోష్ శోభన్), ఐటీ ఉద్యోగం కోసం వెతికే మిత్ర (మానస వారణాసి) చెన్నైలో అనుకోకుండా కలుసుకొని లివింగ్ రిలేషన్‌లోకి వెళ్లడం, వారి ప్రేమ ప్రయాణంలో ఎదురయ్యే అడ్డంకులే ఈ కథకు కేంద్ర బిందువు. యూత్ ఆలోచనలు, రిలేషన్‌షిప్ ఎమోషన్స్, పేరెంట్స్–చిల్డ్రన్ భావోద్వేగాలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని టాక్. సినిమాలో రొమాంటిక్ డోస్ ఎక్కువగా ఉండటం, కొన్ని సన్నివేశాల్లో శృంగార అంశాలు మోతాదుకు మించి ఉన్నాయని సెన్సార్ అధికారులు అభిప్రాయపడ్డారు. కొన్ని కట్స్, మార్పులు సూచించినప్పటికీ కథ అవసరాల దృష్ట్యా కొన్ని సెమీ–అడల్ట్ కంటెంట్‌ను అలాగే ఉంచినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ కారణాలతో సినిమాకు A (Adults Only) సర్టిఫికెట్ జారీ చేశారు. అంటే 18 ఏళ్లు పైబడినవారికే వీక్షణ అనుమతి ఉంటుంది. కథను సాగదీయకుండా ఫీల్‌గుడ్ టోన్‌లో కాంపాక్ట్‌గా రూపొందించిన ఈ చిత్రానికి 2 గంటలు 1 నిమిషం (121 నిమిషాలు) నిడివిని ఫిక్స్ చేశారు. యూత్, కపుల్స్‌ను ఆకట్టుకునే ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తుందో చూడాలి.

 

క‌థ :

శివ (సంతోష్ శోభన్) చదువు పూర్తయ్యాక కూడా సరైన ఉద్యోగం దొరకక ఇబ్బందులు పడుతూ ఉంటాడు. జీవనం కోసం చెన్నైలో బైక్ ట్యాక్సీ నడుపుతూ రోజులు గడుపుతుంటాడు. మరోవైపు మిత్ర (మానస వారణాసి)కి ఇంట్లో పెళ్లి మాటలు రావడంతో ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి ఉద్యోగం పేరుతో చెన్నైకి వస్తుంది. అనుకోకుండా ఆమె ఉండే హాస్టల్ ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కొత్త హాస్టల్ కోసం ఎంత వెతికినా దొరకకపోవడంతో, శివపై నమ్మకం ఉంచి అతని గదినే షేర్ చేసుకోవడానికి సిద్ధమవుతుంది.

కొన్ని రోజులు కలిసి ఉండే క్రమంలో ఇద్దరి మధ్య అనుబంధం పెరిగి ప్రేమగా మారుతుంది. చివరికి లివ్–ఇన్ రిలేషన్‌లోకి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఈ సమయంలో శివకు మంచి ఉద్యోగం దొరుకుతుంది కానీ మిత్ర మాత్రం ఉద్యోగం లేక ఖాళీగానే ఉంటుంది. దీనివల్ల వారి మధ్య అభిప్రాయ భేదాలు, చిన్న చిన్న గొడవలు మొదలై విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి శివ–మిత్ర మళ్లీ కలుస్తారా? వారి లివ్–ఇన్ సంబంధం విషయం కుటుంబ సభ్యులకు ఎలా తెలుస్తుంది? ఆ తర్వాత వారి జీవితాల్లో ఏం జరుగుతుంది? అన్నదే కథలో ప్రధాన ఉత్కంఠ.

విశ్లేషణ:

‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా టైటిల్ మార్చి ‘ఫ్రెండ్లీ కపుల్’గా పెడితే యు/ఎ సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ బోర్డు సూచించినా, చిత్ర బృందం ఆ మార్పుకు ఒప్పుకోకుండా అసలు టైటిల్‌నే కొనసాగిస్తూ ‘ఎ’ సర్టిఫికెట్‌ను స్వీకరించడం విశేషం. ట్రైలర్‌లో కనిపించిన ఇంటిమేట్ సీన్ల కారణంగా ఇది యూత్ మసాలా మూవీ అనుకున్న వారు కూడా ఉన్నారు. అయితే సినిమాలో లిప్‌లాక్స్, బెడ్‌రూమ్ సన్నివేశాలు ఉన్నప్పటికీ అవి కేవలం ఆకర్షణ కోసం పెట్టినవి కాకుండా కథలో సహజంగా భాగమై కనిపిస్తాయి. యువతను రెచ్చగొట్టే విధంగా కాకుండా, నేటి తరం రిలేషన్‌షిప్స్‌ను వాస్తవికంగా చూపించే ప్రయత్నంగా అనిపిస్తాయి. టైటిల్ విషయంలోనే కాదు, కథ చెప్పడంలో కూడా టీం ఎక్కడా రాజీ పడలేదన్న భావన స్పష్టంగా కనిపిస్తుంది. ప్రేమ, సహజీవనం వంటి అంశాలను పరిపక్వంగా ట్రీట్ చేయడం ఈ చిత్రానికి ప్రత్యేకతగా నిలిచింది.

ఈ తరహా లివిన్ రిలేషన్ నేపథ్య కథలు తెలుగు తెరపై కొత్తవి కాకపోయినా, వాటిని చూపించే విధానం ఈ చిత్రంలో భిన్నంగా అనిపిస్తుంది. హీరో–హీరోయిన్ పరిచయం నుంచే కథ సహజంగా ముందుకు సాగుతూ, సినిమా చూస్తున్నామనే భావన కంటే నిజ జీవితాన్ని చూస్తున్నామన్న ఫీలింగ్ కలిగిస్తుంది. రియల్ లొకేషన్లు, సహజ సంభాషణలు కథతో ఈజీగా కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. ప్రథమార్థం సరదాగా సాగితే, ద్వితీయార్థం భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇస్తుంది. క్లైమాక్స్‌లో తమిళ టచ్ కనిపించినా హృదయాన్ని తాకేలా ఉంటుంది. కొన్ని సన్నివేశాల్లో లాజిక్ తగ్గిన భావన, సెకండాఫ్‌లో కొద్దిపాటి సాగదీత ఉన్నా మొత్తం మీద హీరో–హీరోయిన్ల కథతో పాటు కుటుంబ భావోద్వేగాలూ బాగా పండాయి. గత కొన్నేళ్లలో తెలుగులో వచ్చిన ప్రత్యేక ప్రేమకథల జాబితాలో ఈ చిత్రం ఒక మంచి స్థానం సంపాదించగలిగింది.

ramu

Ramu ( Tandu Ramalingaiah ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి