Chhaava Telugu Trailer : సినీ అభిమానులు ఛావా తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. ఇక రచ్చ చేయండి..!
ప్రధానాంశాలు:
Chhaava Telugu Trailer : సినీ అభిమానులు ఛావా తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. ఇక రచ్చ చేయండి..!
Chhaava Telugu Trailer : బాలీవుడ్ Bollywood నటుడు విక్కీ కౌశల్ , లక్ష్మణ్ ఉటేకర్ కాంబినేషన్ లో రూపొందిన తాజా చిత్రం ఛావా .మరాఠా యోధుడు శంబాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మడాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేశ్ విజన్ నిర్మించిన ఈ సినిమాలో రష్మిక మందన్న Rashmika కథానాయికగా నటించారు.

Chhaava Telugu Trailer : సినీ అభిమానులు ఛావా తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. ఇక రచ్చ చేయండి..!
Chhaava Telugu Trailer ఛావా సంచలనం..
హిందీలో మంచి హిట్ సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్ విడుదల చేయనున్నారు. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఈ సెన్సేషనల్ హిట్‌ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల చేయగా, ఇది టాలీవుడ్ Tollywood ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఛావా Chaava సినిమా రిలీజ్ తర్వాత తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకువెళ్లి బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించింది.తొలి వారాంతంలోనే ఇండియాలో 116.5 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత అదే దూకుడును ప్రదర్శించింది. ఇప్పుడు తెలుగులో ఎంతటి రచ్చ చేస్తుందో చూడాలి.