Actress : అత‌నితో పిల్ల‌ల‌ని క‌నాల‌ని ఎంతో ట్రై చేశాను.. కాని కుద‌ర‌లేద‌న్న స్టార్ భామ‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Actress : అత‌నితో పిల్ల‌ల‌ని క‌నాల‌ని ఎంతో ట్రై చేశాను.. కాని కుద‌ర‌లేద‌న్న స్టార్ భామ‌

 Authored By ramu | The Telugu News | Updated on :23 June 2025,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Actress : అత‌నితో పిల్ల‌ల‌ని క‌నాల‌ని ఎంతో ట్రై చేశాను.. కాని కుద‌ర‌లేద‌న్న స్టార్ భామ‌

Actress  : ఒకనాటి బాలీవుడ్‌ అందాలభామ రాణీ ముఖర్జీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ప్ర‌స్తుతం సినిమాల‌కి కాస్త దూరంగానే ఉంటుంది. ఇటీవ‌ల ఓ క్రేజీ ఆఫర్‌ వరించిందని బాలీవుడ్‌ మీడియా కోడై కూసింది. పైగా అది హిందీ సినిమా కాదు.. తెలుగు సినిమా. అదికూడా చిరంజీవి సినిమా. చిరంజీవి హీరోగా శ్రీకాంత్‌ ఓదెల ఓ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ చేస్తుండ‌గా, ఇందులో హీరోయిన్‌ పాత్ర చాలా కీలకమట. అది కూడా మధ్య వయస్కురాలి పాత్రట. ఆ పాత్ర కోసం రాణీని సంప్ర‌దించిన‌ట్టు టాక్.

Actress అత‌నితో పిల్ల‌ల‌ని క‌నాల‌ని ఎంతో ట్రై చేశాను కాని కుద‌ర‌లేద‌న్న స్టార్ భామ‌

Actress : అత‌నితో పిల్ల‌ల‌ని క‌నాల‌ని ఎంతో ట్రై చేశాను.. కాని కుద‌ర‌లేద‌న్న స్టార్ భామ‌

Actress  : ఆ బాధ ఒక్క‌టే..

అయితే రాణి ముఖర్జీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఏడేళ్లుగా తాను మనసులో ఉన్న విషాదాన్ని బ‌య‌ట‌పెట్టింది.. దాదాపు ఏడేళ్లుగా తాను రెండవ బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నానని.. కానీ ఇప్పటికీ అది సాధ్యం కావడం లేదని ఆమె తెలిపింది. నా కుమార్తెకు ఇప్పుడు ఎనిమిదేళ్లు. ఆమెకు ఒకటిన్నర వయసు ఉన్నప్పుడు నుంచి రెండవ బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నా కానీ కుదరలేదు. గతంలో మరోసారి ప్రెగ్నెంట్ అయ్యాను.

అయితే ఆ సంతోషం ఎక్కువ రోజులు ఉండలేదు. నాకు గర్భస్రావం జరిగింది. దీంతో కడుపులోనే రెండో బిడ్డను కోల్పోయాను. ఇప్పుడు నా వయసు 46 సంవత్సరాలు. ఇప్పుడు నేను బిడ్డను కనే పరిస్థితిలో లేను. నా కుమార్తెకు.. చెల్లిని, లేదా తమ్ముడిని ఇవ్వలేకపోయాననే బాధ ఇప్పటికీ వేధిస్తుంది. కానీ మనకు లభించిన దానితో మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే విషయాన్ని తెలుసుకున్నాను అని బాధ‌గా చెప్పించి రాణీ.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది