
Chiranjeevi About Ap Ticket rates Go
Chiranjeevi : సినిమా పరిశ్రమలకు సంబంధించిన సమస్యలని సాల్వ్ చేసేందుకు చిరంజీవి ముందడగు వేసిన విషయం తెలిసిందే.గత కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపిన ఆయన ఎట్టకేలకు విజయం సాధించాడు. ఏపీ ప్రభుత్వం మొత్తానికి సినిమా టికెట్ రేట్లకు సంబంధించిన జీవోను విడుదల చేసింది. అందరూ అనుకున్నట్టుగానే రాధే శ్యామ్ సినిమా విడుదల కంటే ముందుగానే ఈ జీవో వచ్చేసింది. ఇందులో టికెట్ రేట్ల అందరికీ ఆమోదయోగ్యంగానే ఉన్నాయి. కనిష్టంగా రూ. 20 ఉంటే.. గరిష్టంగా రూ. 250 ఉంది. అయితే 20 శాతం షూటింగ్‌లు ఏపీలో చేసి ఉండి.. రెమ్యూనరేషన్లు కాకుండా.. సినిమా బడ్జెట్ వంద కోట్లు అయి ఉంటే..
అలాంటి వాటికి టికెట్ రేట్లను పెంచుకునే వెసులు బాటును ఏపీ ప్రభుత్వం కల్పించింది.ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఈ కొత్త జీవోపై చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ‘తెలుగు సినిమా పరిశ్రమకు మేలు కలిగే విధంగా, అటు థియేటర్ల మనుగడను, ప్రజలకి వినోదం అందుబాటులో ఉండాలనే సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని, సినిమా టికెట్ రేట్స్ సవరిస్తూ సరికొత్త జీవో జారీ చేసిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి పరిశ్రమ తరుపున కృతజ్ఞతలు. చిన్న సినిమాకు ఐదవ షో అవకాశం కల్పించడం ఎందరో నిర్మాతలకు ఉపయోగపడే అంశం. సంబంధిత మంత్రి వర్యులు పేర్ని నాని గారికి, అధికారులకు, కమిటీకి ధన్యవాదాలు’ అని చిరంజీవి పోస్ట్ చేశాడు.
Chiranjeevi About Ap Ticket rates Go
ఇక తాజాగా ఆయన అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా చిరంజీవి బ్లడ్ బ్యాంకులో జరిగిన మహిళా దినోత్సవ సంబరాలకు హాజరయ్యారు. సినీ పరిశ్రమలోని మహిళలకు చిరంజీవి దంపతులు సన్మానం చేశారు. అలాగే, మహిళా కార్మికులకు చీరలు పంపిణీ చేయడం విశేషం. ఇక “సినిమా టికెట్ల జీవోపై ఇప్పుడు మాట్లాడను.. ఇది సందర్భం కాదు. నేను ఇప్పుడు ఏది మాట్లాడినా కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంది. జీవో గురించి అవసరమైతే ప్రత్యేకంగా మాట్లాడతా” అని అన్నారు. ఇక కొత్త జీవో ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని..సినిమా టికెట్ల ధరల పెంపుపై ప్రత్యేకంగా మీడియా సమావేశం పెడతాను అని అన్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.