
Chiranjeevi About His First Love
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి లైఫ్‌లో ప్రేయాయణం ఉంది అంటే అందరికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చిరంజీవి ఏదో రొమాంటిక్‌గా మాట్లాడుతారు తప్ప ఆయన జీవితంలో ప్రేమ ఉంటుందనేది ఎవరికి తెలియదు. తాజాగా తన ఫస్ట్ లవ్ గురించి నోరు విప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. లాల్ సింగ్ చద్దా సినిమాను చిరంజీవి తెలుగులో సమర్పిస్తున్న విషయం తెలిసిండే. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిరంజీవి, అమీర్ ఖాన్, నాగ చైతన్యలను టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇంటర్వ్యూ చేశారు. త్వరలో టెలీకాస్ట్ కానున్న ఈ ఇంటర్వ్యూ ప్రొమోను విడుదల చేశారు.ఈ ప్రొమోలో ఎన్నో ఆసక్తికర విషయాలను, నవ్వులను పంచుకున్నారు సెలబ్రిటీలు.
‘లాల్ సింగ్ చద్దాలో అమీర్ ఖాన్ ఒక చిన్న పిల్లాడిలా, కాలేజ్ స్టూడంట్‌లా, ఆర్మీ ఆఫీసర్‌లా కనిపిస్తారు. ఈ టాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది’ అని నాగార్జున ప్రశ్నించారు. దానికి వీఎఫ్‌ఎక్స్ వాళ్లు అంతా చేశారని అమీర్ ఖాన్ చెప్పగా.. ‘ఈ మాటలు ఎడిట్ చేయండి’ అని చిరంజీవి చెప్పడం సరదాగా అనిపించింది. ఈ క్రమంలోనే ‘ఈ సినిమాలో పదేళ్ల వయసులోనే హీరో ప్రేమలో పడతాడు’ అని నాగార్జున అన్న వెంటనే.. ‘మీరు తొలిసారి ఎప్పుడు ప్రేమలో పడ్డారు?’ అని చిరుని అమీర్ ఖాన్ అడుగుతారు. అప్పుడు చిరంజీవి ‘ఏడో తరగతిలో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డాను అని అన్నారు.
Chiranjeevi About His First Love
ఒక అమ్మాయి సైకిల్ తొక్కడం అంటే మా మొగల్తూరులో చాలా ఆశ్చర్యంగా ఉండేది. అలాంటిది ఆ అమ్మాయి పట్టుకుంటే నేను సైకిల్ తొక్కేవాడిని. అప్పుడు సైకిల్ తొక్కడంపై కాన్సంట్రేషన్ పక్కన పెట్టి ఆమెను చూసేవాన్ని. అప్పుడు ఆమె ముందు చూడు అంటూ నా ముఖాన్ని ముందుకు తిప్పేది’ అని తెలిపారు. అలాగే చిరంజీవితో సినిమా చేయాలని ఉందని అమీర్ ఖాన్ తెలిపారు. మెగాస్టార్‌తో డైరెక్షన్, లేదా ప్రొడక్షన్‌లో సినిమా చేస్తానని అమీర్ అన్నారు. అప్పుడు చిరంజీవి ‘టేక్ వన్ ఓకే కాదు కదా..’ అని అనండతో అమీర్ నవ్వేశారు. తర్వాత ‘ప్రొడక్షన్ ఓకే. డైరెక్షన్ మాత్రం ఒప్పుకోవద్దు’ అని నాగార్జున సలహా ఇచ్చారు
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.