Dil Raju : చిరంజీవి, బాలకృష్ణలను భయపెడుతున్న దిల్ రాజు.. ఇది నిర్మాత పవర్
Dil Raju : మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మరియు నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి సినిమాలు వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసింది. ఒక రోజు అటు ఇటుగా ఈ రెండు సినిమా లు కూడా బాక్సాఫీస్ వద్ద తలపడేందుకు రెడీ అవుతున్నాయి. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ రెండు సినిమా లు కూడా ఒకే సారి విడుదల అవ్వడం తో థియేటర్ల సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి అంటే తెలుగు సినిమా కు పెద్ద సీజన్. ఆ సీజన్ లో కాస్త తక్కువ థియేటర్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా తప్పకుండా మంచి ఫలితం దక్కుతుంది అంటూ చాలా మంది నమ్ముతూ ఉంటారు.
గతంలో ఈ ఇద్దరు హీరోలు కూడా సంక్రాంతి బరిలో నిలిచి సక్సెస్ అయ్యారు. కనుక ఈ సారి కూడా తప్పకుండా సక్సెస్ అవుతారని అంతా భావిస్తున్నారు. కానీ ఈసారి ఈ ఇద్దరు హీరోలను ప్రముఖ నిర్మాత దిల్ రాజు భయపెడుతున్నాడు అంటూ ఇండస్ట్రీలో గుస గుసలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ సింగిల్ స్క్రీన్ థియేటర్లు మరియు మల్టీప్లెక్స్ లు దిల్ రాజు ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటాయి. ఆయన ఏ సినిమా కు చెబితే ఆ సినిమా కోసం స్క్రీన్ కేటాయించడం జరుగుతుంది. కనుక ఆయన తో మచ్చిక చేసుకుని తమ సినిమా లను ఆయన ద్వారా విడుదల చేసేందుకు చాలా మంది పెద్ద హీరోల సినిమాల నిర్మాతల నుండి చిన్న సినిమాల నిర్మాతల వరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

chiranjeevi and balakrishna tension about dil raju sankranthi film release
సంక్రాంతి కి ఆయన భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సూపర్ స్టార్ విజయ్ వారసుడు సినిమా కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కనుక ఆ సినిమా కోసం మెజార్టీ థియేటర్లను బుక్ చేసి పెట్టేసాడని ఆ థియేటర్లను బ్లాక్ చేయడం వల్ల ఇప్పుడు వీర సింహా రెడ్డి మరియు వాల్తేరు వీరయ్య సినిమాలకు థియేటర్లు కరువయ్యాయి అంటూ మెగా మరియు నందమూరి ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ చివరి వరకు కూడా దిల్ రాజు థియేటర్లను ఇవ్వక పోతే తమ సినిమాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ చిరంజీవి మరియు బాలకృష్ణ ఆందోళనతో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందులో నిజం ఎంత తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.