Chiranjeevi : చిరంజీవి సినిమా అంటే అన్నీ కమర్షియల్ అంశాలు ఉండాల్సిందే. ఆయనతో డాన్స్ చేసే హీరోయిన్… ఫైట్స్ చేసే విలన్స్..పవర్ ఫుల్ డైలాగ్స్.. మంచి కామెడీ చేసే సహ నటులు..ఇలా ప్రతీదీ చిరంజీవి సినిమాలో ఉండాల్సిందే. చిరంజీవి సినిమాలో ఏ ఒక్కటి మిస్ అయినా కూడా ఫ్యాన్స్ ఒప్పుకోరు. అందుకే ఆయన సినిమా కోసం దర్శక, రచయితలు పక్కాగా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటేనే ఆయన వద్దకు వస్తారు. అయితే కొన్ని సినిమాల విషయంలో చిరంజీవి కోసం కొన్ని పాత్రలు క్రియేట్ చేయడం కత్తి మీద సాముగా తయారవుతోంది. గతంలో కూడా ఠాగూర్ సినిమా విషయంలో కొన్ని సీన్స్ కానీ.. హీరోయిన్ విషయం లో కానీ స్క్రిప్ట్ లో బలవంతంగా ఇరికించారు.
ఇపుడు అలాంటి సందర్భమే మళ్ళీ రిపీటవుతోంది. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలో కంప్లీట్ అవుతోంది. దాంతో మలయాళ హిట్ సినిమా లూసీఫర్ తో సెట్స్ మీదకి రాబోతున్నాడు. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్నాడు. గత నెల ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లో 153 గా రాబోతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా స్క్రిప్ట్ లో హీరోయిన్ క్యారెక్టర్ ని క్రియేట్ చేస్తున్నారట. ఒరిజనల్ వెర్షన్ లో హీరోయిన్ లేకపోగా.. మెగాస్టార్ సినిమా కాబట్టి ఖచ్చితంగా హీరోయిన్ ఉండాల్సిందే.
Chiranjeevi : ఆకుల శివ, సాయిమాధవ్ బుర్రా స్క్రిప్ట్ వర్క్ లో హీరోయిన్ పాత్ర ని సృష్ఠిస్తున్నారు ..?
అందుకే దర్శక, రచయితలు హీరోయిన్ పాత్ర ని సృష్ఠించి ఆ పాత్రకి ప్రాముఖ్యత ఉండేలా డెవలప్ చేస్తున్నారట. ఆకుల శివ, సాయిమాధవ్ బుర్రా స్క్రిప్ట్ వర్క్ లో పాల్గొంటున్నారు. కాగా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ఫైనల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే థమన్ అద్భుతమైన ట్యూన్స్ ని రెడీ చేస్తున్నట్టు సమాచారం. ఇక ఆచార్య మే 13 న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా రాం చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. కాగా చిరంజీవి 153 దసరా పండుగకి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.