
chiranjeevi balayya coming to rrr movie pre release event
RRR Movie : టాలీవుడ్ జక్కన్నగా పేరు గాంచిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది. ఇందులో రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. ఇక ఈ పిక్చర్ ప్రమోషన్స్ వేరే లెవల్‌లో ఉన్నాయి.బాలీవుడ్‌లో ఈ సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఇటీవల ముంబైలో ఈ సినిమా కోసం గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ హాజరయ్యారు. కాగా, ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా భారీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏ డేట్‌లో నిర్వహిస్తారనే విషయమై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ, ఈ వేడుకకు టాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్.. చిరంజీవి, బాలకృష్ణలు అతిథులుగా హాజరు కాబోతున్నారని సమాచారం. ఈ విషయమై ఇప్పటికే హీరోలను మేకర్స్ కలిశారని టాక్. ఇండస్ట్రీలో పాజిటివ్ వైబ్రేషన్స్ కొంత కాలం నుంచి కొనసా..గుతున్నాయి. ‘అఖండ’ ఫిల్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ ఈవెంట్‌కు గెస్టులుగా చిరంజీవి, బాలకృష్ణ హాజరవుతారని తెలుస్తోంది.
chiranjeevi balayya coming to rrr movie pre release event
ఒకవేళ చిరంజీవి, బాలకృష్ణ ఒకే వేదికపై ‘ఆర్ఆర్ఆర్’ కోసం వస్తే కనుక అభిమానులకు పండుగే అని సినీ పరిశీలకులు అంటున్నారు. మెగా, నందమూరి అభిమానులు కలిసి కట్టుగా సినిమాను మరింత విజయం చేస్తారని పేర్కొంటున్నారు. ఇక ఈ సినిమాలో నటించిన నటీ నటులు అందరూ హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరవుతారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందించారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్, సముద్రఖని, సీనియర్ హీరోయిన్ శ్రియ కీలక పాత్రలు పోషించగా, హీరోయిన్స్‌గా ఆలియా భట్, ఒలివియా నటించారు. ఇక రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతా రామరాజు పాత్ర పోషించగా, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం రోల్ ప్లే చేశాడు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.