Ram Charan : ఆ టైంలో రామ్ చరణ్ నీ లాకెళ్లి బెల్టుతో కొట్టిన చిరంజీవి..!!
Ram Charan : మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడిగా విజయవంతంగా దూసుకెళ్లిపోతున్న సంగతి తెలిసిందే. నటనపరంగా ఇంకా డాన్స్ పరంగా చిరంజీవి అలరించే రీతిలోనే అభిమానులను కాలర్ ఎగరేసే రీతిలో ప్రపంచ సినిమా రంగంలో ఎన్నో ఉన్నత శిఖరాలను చరణ్ చేరుకోవడం జరిగింది. గత ఏడాది “RRR” తో తిరుగులేని విజయాన్ని అందుకుని ప్రపంచ స్థాయిలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.
ఇదిలా ఉంటే చరణ్ చిన్ననాటి ఓ సంఘటన తాజాగా బయటపడింది. మేటర్ లోకి వెళ్తే చరణ్ చాలా చిన్నప్పుడు వాళ్ళ డ్రైవర్ వేరే వారిని బూతులు తిడుతూ.. ఉంటే వాటిని వినడం జరిగిందట. ఇంతలో ఇంట్లో హాల్లో కూర్చున్న నాగబాబుని రామ్ చరణ్ స్వయాన విన్న అవే బూతు పదాలతో కామెంట్స్ చేయడం జరిగిందట. వెంటనే నాగబాబు.. చరణ్.. తనని దారుణంగా తిట్టినట్లు పైన రూమ్ లో ఉన్న చిరంజీవికి చెప్పటం జరిగింది అంట. ఒక్కసారిగా చిరంజీవి… చరణ్ ని రూమ్ లోకి లాక్కెళ్లి తన బెల్ట్ తీసి ఎడాపెడ వాయించేసారట.
Chiranjeevi Beat at that time Ram charan
ఈ విషయం ఓ ప్రముఖ తెలుగు టీవీ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ తెలియజేశారు. ఆ బూతులకు తనకు అర్థం కూడా తెలియదని చాలా చిన్న వయసులో.. బాబాయ్ నాగబాబుని అలాగనేసరికి నాన్న తట్టుకోలేక.. బూతులు మాట్లాడటంతో అప్పుడు తనపై చేయి చేసుకున్నట్లు చరణ్ తెలియజేయడం జరిగింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
