Chiranjeevi : చిరంజీవి చేస్తోన్న పనులు ఇప్పుడు అభిమానులనే ఆగ్రహానికి గురి చేసేలా ఉంటున్నాయి. మరీ నాసిరకంగా సినిమాలను ఎంచుకుంటున్నాడు. పనీ పాట లేనట్టుగా.. చెత్త సినిమాలను రీమేక్ చేస్తున్నాడు. ఎప్పుడో వచ్చిన చిత్రాలను ఇప్పుడు రీమేక్ చేస్తున్నాడు. అందులో ఒకటే భోళా శంకర్. తమిళంలో వచ్చిన వేదాళం సినిమాను ఇప్పుడు భోళా శంకర్ అంటూ తీస్తున్నాడు. అది కూడా మెహర్ రమేష్ వంటి దర్శకుడితో. ఆచార్య చిత్రం డిజాస్టర్ అవ్వడంతో చిరంజీవి తదుపరి సినిమాపై అభిమానులు కంగారు పడుతున్నారు. ఇక ఈ భోళా శంకర్ కథ ఇలా ఉంటే.. మలయాళంలో వచ్చిన లూసిఫర్‌ను గాడ్ ఫాదర్ అంటూ తెరకెక్కిస్తున్నాడు. మొన్నీ మధ్య చిన్న గ్లింప్స్ వచ్చింది.
అందులో చిరంజీవిని చూసి అందరూ నవ్వుకున్నారు. ఆ గెటప్ ఏంటి.. ఆ డ్రెస్ ఏంటి.. అని నవ్వుకున్నారు. గాడ్ ఫాదర్ మీద లెక్కలేనన్ని ట్రోల్స్ జరిగాయి. ఇప్పుడు భోళా శంకర్ ప్రాజెక్ట్ మీద ట్రోలింగ్ మొదలైంది. అసలే ఈసినిమాను ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నట్టుగా అనిపిస్తోంది. చిరంజీవికి ఈ తిప్పలు అవసరమా? అన్నట్టుగా కనిపిస్తోంది. మెగాస్టార్ సోలోగా సినిమాలు చేయడం మానేసారు. ఏవరో ఒక హీరో తోడు వుంటాల్సిందే. ఆచార్య కు రామ్ చరణ్, గాడ్ ఫాదర్ కు సల్మాన్, వాల్తేర్ వీరయ్యకు రవితేజ లను తీసుకున్నారు. ఇప్పుడు అలాగే ఈ భోళాశంకర్ కు కూడా మరో యంగ్ హీరో తోడు కావాలట. అయితే ఈ హీరో ఎవరు? అన్నది ఎంతకీ తేలడం లేదని తెలుస్తోంది.
చిరంజీవి సినిమాకు ఇలాంటి గతి రావడం ఏంటి? అని అందరూ అనుకుంటున్నారు. భోళా శంకర్ కోసం హీరో నితిన్‌ను అడిగారు. కానీ ఇప్పటి వరకు ఎస్ ఆర్ నో అన్నది తెలియలేదట. అందుకే అలా పెండింగ్ లో వుంచినట్లు తెలుస్తోంది. నితిన్ కాదంటే ఆ రేంజ్ యంగ్ హీరో ఎవర్నయినా తీసుకోవాలి. మరో మెగా హీరో తొడు తీసుకోవడం అన్నది మెగాస్టార్ కు ఇష్టం లేనట్లు వుంది. లేదూ అంటే సాయిథరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ అంటూ ముగ్గురు వుండనే వున్నారు. కానీ బయట హీరో కోసం వెదుకులాడుతున్నారట. ఆ క్రమంలోనే ఈ సినిమాను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇలా చిరంజీవి సినిమాల మీద బయట రకరకాల ట్రోలింగ్స్ జరుగుతున్నాయి.
Banana - Apple : అరటిపండు ఎంతో మధురంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండులో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.…
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం…
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
This website uses cookies.