Chiranjeevi : సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారంపై సీఏం సానుకూలంగా స్పందించారు మెగాస్టార్ చిరంజీవి
Chiranjeevi : ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై మెగాస్టార్ చిరంజీవి సీఏం జగన్ తో జరిపిన భేటీ ముగిసింది. ఇరువురి మధ్య జరిగిన చర్చల అనంతరం.. చిరు మీడియా ముందుకు వచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో మీటింగ్ సంతృప్తికరంగా జరిగిందన్నారు. సినీ పరిశ్రమ సమస్యల గురించి ఆయనకు అంతా వివరించినట్లు చిరు చెప్పుకొచ్చారు. ఆ
యా సమస్యలను పరిష్కరించే దిశగా సీఏం సానుకూలంగా స్పందించారని అన్నారు. జీఓ 35 గురుంచి పునారలోచిస్తానని ఆయన హామీ ఇచ్చారని చెప్పారు. మరో 10 రోజుల్లో అందరికీ ఆమోద యోగ్యమైన జీవో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ.. సినిమా పరిశ్రమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు దయచేసి ఎవరు ఆ అంశంపై మాట్లాడొద్దని చిరంజీవి విజ్ఞప్తి చేశారు.
ఏపీలో సినిమా టికెట్ల రేట్లను భారీగా తగ్గించారంటూ కొద్ది రోజులుగా సినీ ప్రముఖులకు ఏపీ ప్రభుత్వానికి మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఈ వివాదంలోకి పెద్ద తలకాయలు ఎంటరయ్యేసరికి ఇది మరింత ముదిరిపోయింది. ఈ భేటీ అయినా ఏపీలో సినిమా టికెట్ల వివాదానికి ముగింపు పలుకుంతుందని ఇప్పుడంతా భావిస్తున్నారు.