Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా డైఉరక్షన్ లో వస్తున్న గాడ్ ఫాదర్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో చిరు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరు ప్రస్తుతం పాలిటిక్స్ గురించి ప్రస్థావించారు. అంతేకాదు జనసేనకు తన మద్ధతు ఉంటుందా లేదా అన్న విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు. పవన్ ఇంకా పొల్యూట్ కాలేదని.. ఓ నిబద్ధత కలిగిన వ్యక్తి అని.. తప్పకుండా రాజకీయాల్లో మార్పు తెస్తారని అన్నారు. అయితే తాను ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నానని.. తమ్ముడికి సపోర్ట్ చేసే అవకాశం లేదని అన్నారు చిరు.
అయితే భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఏపీ ఎలక్షన్స్ లో ప్రక్షాళన చేయాలని అనుకుంటున్నారు. అయితే చిరు జనసేనకు మద్ధతు ఇస్తారా లేదా అన్నది తెలుసుకోవాలని మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహం ఏర్పడింది. అయితే చిరు చాలా తెలివిగా ఈ విషయంపై స్పందించారు. తమ్ముడికి అవసర్మైనప్పుడు తన సపోర్ట్ ఉంటుందని అన్నారు చిరు. గాడ్ ఫాదర్ సినిమా మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి రీమేక్ గా వస్తుంది. మోహన్ రాజా డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో నయనతార ఫీమేల్ లీడ్ గా నటించారు.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా నటించారు. సినిమాలో చిరు పొలిటికల్ లీడర్ గా కనిపిస్తారు. అయితే సినిమాలో కొన్ని డైలాగ్స్ వైసీపీని టార్గెట్ చేశారని కామెంట్స్ వచ్చాయి. కానీ అలాంటిది ఏమి లేదని క్లారిటీ ఇచ్చారు చిరు. ఆచార్య ఫ్లాప్ అవగా గాడ్ ఫాదర్ సినిమాపై ప్రెజర్ ఉంది. సినిమాలో సత్యదేవ్, సునీల్ వంటి స్టార్స్ కూడా నటించారు. చిరు గాడ్ ఫాదర్ సినిమా 92 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. గాడ్ ఫాదర్ హిట్ అవ్వాలి అంటే 100 కోట్ల దాకా కలెక్ట్ చేయాల్సి ఉంది. చిరంజీవి తో పాటుగా ఈరోజు నాగార్జున ది ఘోస్ట్ కూడా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా కూడా భారీ అంచనాలతో వస్తుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.