Home » Entertainment » Rashmika Mandanna Latest Photoshoot Viral
Entertainment

Rashmika Mandanna : తాజా అందాలతో రష్మిక మందన్న.. శ్రీవల్లి చూపుల మత్తులో కుర్రాళ్లు విలవిల..!

Authored By
Rame Samhith
The Telugu News | Published on: October 5, 2022, 11:00 am
Advertisement

Rashmika Mandanna : కన్నడ భామ రష్మిక మందన్న తెలుగులో సూపర్ ఫాం లో ఉంది. ఇక్కడ ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు వరుస సినిమాలతో దూసులెళ్తుంది. ముందు యువ హీరోల సినిమాలతో ఛాన్స్ అందుకున్నా ఆ తర్వాత క్రేజీ ఛాన్సులు అందుకుంది. స్టార్ సినిమాల్లో రష్మిక మొదటి ఆప్షన్ అయ్యింది అంటే అమ్మడి రేంజ్ ఏంటన్నది అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు పుష్ప సినిమాతో రష్మిక నేషనల్ వైడ్ గా కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆమె చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ వసూళ్లు రాబడుతున్నాయి. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా రష్మిక తన సత్తా చాటుతుంది.

Advertisement

అమితాబ్ తో గుడ్ బై.. సిద్ధార్థ్ మల్ హోత్రాతో మిషన్ మజ్ఞు సినిమాల్లో నటిస్తుంది రష్మిక. ఈ రెండు సినిమాలతో రష్మిక బాలీవుడ్ లో పాగా చేయాలని చూస్తుంది. పుష్ప 2 తో మరోసారి నేషనల్ వైడ్ గా తన స్టామినా చూపించాలని చూస్తుంది రష్మిక. సినిమాలతో పాటుగా అమ్మడు తన ఫోటో షూట్స్ తో కూడా సత్తా చాటుతుంది. లేటెస్ట్ గా రష్మిక తన వైట్ అండ్ వైట్ కాస్టూం తో ప్రేక్షకులను అలరించింది. అయితే ఈసారి గ్లామర్ ఎటాక్ తో కాకుండా జస్ట్ తన చూపులతోనే మత్తు చల్లేస్తుంది.

rashmika mandanna latest photoshoot viral

Advertisement

ఏ బిట్ ఆఫ్ ఫ్రెష్ బ్రీజ్ ఫర్ యువర్ ఫీడ్ టుడే అనే కామెంట్ తో రష్మిక తన ఫోటోస్ ని ఇన్ స్టాగ్రాం లో షేర్ చేసింది. రష్మిక ఏం చేసినా ఇలా క్షణాల్లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం రష్మిక ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రష్మిక హడావిడి చూస్తుంటే మరో ఐదారేళ్లు ఇదే ఫాం కొనసాగించేలా ఉంది. అమ్మడు చేస్తున్న ఈ అందాల రచ్చకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. శ్రీవల్లి ఏం చేసినా అదో క్రేజ్ ఉంటుంది. ఎంతైనా నేషనల్ క్రష్ కాబట్టి ఆమాత్రం ఉండాల్సిందే. రాబోతున్న సినిమాలతో ప్రేక్షకులను మరింతగా అలరించాలని చూస్తుంది రష్మిక. అమ్మడి మేనియాకి మిగతా హీరోయిన్స్ సైతం షాక్ అయ్యేలా ఉన్నారు.

Rame Samhith

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి