Daddy Movie : డాడీ సినిమాలోని ఆ చిన్న పాప ఇప్పుడెలా ఉందో చూస్తే షాక్ అవుతారు..!

Authored By Breaking News 2 | The Telugu News | Published on: December 27, 2021, 8:15 am

Daddy Movie : గుమ్మాడి గుమ్మాడి… ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి… డాడీ సినిమాలోని ఈ పాట నేటికీ సీరియల్లలోనే, డ్యాన్స్ షోల ద్వారానో ఏదో ఒక రూపంలో మన ఇళ్ళలో వినిపిస్తూనే ఉంటుంది. 2001లో చిరంజీవి, సిమ్రాన్ హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో.. ఇందులోని ఈ పాట కూడా అంతే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కథ మొత్తం పాప చుట్టే తిరిగిన ఈ సినిమాలో ఐశ్వర్యగా నటించిన బుల్లి పాప పాట వినగానే నేటికీ మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది.

వయసుతో సంబంధం లేకుండా చిన్న నాడే తన నటనతో అందరినీ ఆకట్టుకున్న ఈ పాప పేరు.. అనుష్క మల్హోత్రా. ఇప్పుడు ఈ పాప ఎలా ఉందో తెలిస్తే ఆశ్చర్యపోకమానరు.డాడీ సినిమాలో డబుల్ రోల్ లో నటించిన అనుష్క మల్హోత్రా చేప కళ్ళ అందంతోనే కాక తన అభినయంతో నటించి మెప్పించింది. మెగాస్టార్ చిరంజీవి తో పోటీ పడి మరీ ఏమోషనల్ సన్నివేశాల్లో నటించి కన్నీళ్లు పెట్టించింది. ఈ సినిమా తర్వాతా బాల నటిగా హిందీలో పలు చిత్రాల్లో నటించిన అనుష్క.. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయింది. ఈ సినిమా వచ్చి అప్పుడే 20 యేళ్లు అవుతుండగా ఈ పాప కూడా ఇప్పుడు 20 యేళ్ల వయసును దాటేసి.

chiranjeevi daddy movie anushka malhothra pics went in viral 

chiranjeevi daddy movie anushka malhothra pics went in viral

Daddy Movie : డాడీ సినిమాలోని ఆ చిన్న పాపే ఇప్పుడిలా..!

. హీరోయిన్ అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.ఇటీవల ఈమె ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈమెను చూసిన వారంతా ఎంటీ డాడీ సినిమాలో కనిపించిన ఆ చిన్న పాప అప్పుడే ఇంత పెద్దది అయిపోయిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.రాజేంద్రప్రసాద్, శరత్ బాబు, కోట శ్రీనివాసరావు, అచ్యుత్, ఉత్తేజ్, ఎమ్.ఎస్.నారాయణ వంటి గొప్ప నటి నటులతో తెరకెక్కిన డాడి చిత్రంలో అల్లు అర్జున్ కూడా ఓ పాత్రలో మెరిశారు. భారీ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం 97 కేంద్రాలలో అర్ధ శతదినోత్సవం జరుపుకుని ఆ రోజుల్లో రికార్డు సృష్టించింది.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp