Home » Entertainment » Chiranjeevi Daughter Rejectred Uday Kiran Love Proposal
Entertainment

Uday Kiran : చిరంజీవి కూతురు ఉద‌య్ కిర‌ణ్‌తో ప్రేమ రిజెక్ట్ చేసిందా..అస‌లు విష‌యం ఏంటి?

Authored By
Sam C
The Telugu News | Published on: August 25, 2022, 5:20 pm
Advertisement

Uday Kiran : ఉద‌య్ కిరణ్‌.. ఒక‌ప్పుడు ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరో. ఆయ‌నకు ఎంత మంది అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన ఉదయ్ కిరణ్ సూపర్ స్టార్ అవుతారని అందరూ భావించగా వరుస ఫ్లాపులు ఉదయ్ కిరణ్ కెరీర్ కు మైనస్ అయ్యాయి. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడం ఆయన అభిమానులను ఎంతగానో భావించింది ఆయ‌న చిరంజీవి కూతురితో ప్రేమాయ‌ణం న‌డిపాడ‌ని, ఎంగేజ్‌మెంట్ వ‌ర‌కు వెళ్లి మధ్య‌లోనే ఆగిపోయింద‌ని అలా ఎన్నో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేశాయి. పవన్ కళ్యాణ్ ఉదయ్ కిరణ్ ను చంపేస్తానని బెదిరించారని అప్పట్లో ఇండస్ట్రీలో భారీ ఎత్తున ప్రచారం జరిగింది.

Advertisement

Uday Kiran : నిజం ఏంటి?

ఉదయ్ కిరణ్ ఆత్మహత్య కు చిరంజీవే కారణం అని అప్ప‌ట్లో పుకార్లు వచ్చాయి. అయితే దీనిపై మెగా ఫ్యామిలీ ఎటువంటి స్పందన ఇవ్వలేదు. మెగాస్టార్ ను దగ్గర నుంచి చూసిన ఓ సీనియర్ జర్నలిస్ట్ ఈ విషయం పై స్పందించారు. ఉదయ్ కిరణ్ కు ఆఫర్లు తగ్గిన మాట వాస్తవమే కానీ ఆ కుట్ర వెనుక చిరంజీవి లేడు. చిరంజీవి ఓ తండ్రిలా ఉండే స్థితిలో ఉన్నారని ఇలాంటి వ్యూహాలు రచిస్తే ఆయన ఇమేజ్ తగ్గుతుందని.. ఆయన అలా చేయాల్సిన అవసరమే లేదని వివరించారు. చిరంజీవి తన కూతురును జీవితాంతం బాగా చూసుకునే వ్యక్తితో పెళ్లి చెయ్యాలని అనుకున్నారు.

Chiranjeevi Daughter Rejectred Uday Kiran Love Proposal

Advertisement

అందుకే ఉద‌య్‌కిర‌ణ్‌ని వ‌ద్ద‌నుకున్నారు. ఉదయ్ కిరణ్ విషయం లో జరిగిన దానికి ప్రత్యేకంగా చిరంజీవి ని నిందించడం కరెక్ట్ కాదని సీనియర్ జర్నలిస్ట్ చెప్పుకొచ్చారు. అయితే ఉదయ్ కిరణ్ చనిపోవడానికి గల కారణం ఇప్పటి వరకు ఒక మిస్టరీ గా మిగిలిపోయింది. ఉదయ్ కిరణ్ తల్లిని పోగొట్టుకున్నాడని తండ్రి దూరమైపోయాడని ఉదయ్ మ్యారేజ్ లైఫ్ లో కూడా సమస్యలు వచ్చాయని సుధ అన్నారు. ఉదయ్ కిరణ్ కు ఒంటరితనం వచ్చిందని న‌టి సుధ ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి