Ram Charan : చిరంజీవికి రామ్ చరణ్ హీరో అవ్వడం అస్సలు ఇష్టం లేదంట.. కారణం ఇదేనా?
Ram Charan : మెగాస్టార్ చిరంజీవి వారసుడు రాంచరణ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్రకథనాయకుడిగా కొనసాగుతున్నాడు. ఇటీవల చరణ్ నటించిన అన్ని సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. నిజం చెప్పాలంటే చిరంజీవి చాలా సినిమాలు చేస్తే గానీ ఆయనకు మెగాస్టార్ బిరుదు రాలేదు. కానీ చరణ్‌కు మాత్రం చాలా తక్కువ సినిమాలు చేసి మెగాపవర్ స్టార్ అనే టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
Ram Charan : చెర్రీని సినిమాల్లోకి ఎందుకు వద్దన్నారంటే..
రాంచరణ్ సినిమాల్లోకి వచ్చి ఇప్పుడు పాన్ ఇండియన్ రేంజ్‌కు ఎదిగాడు. రీసెంట్‌గా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేసిన చెర్రీ పాన్ ఇండియన్ స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. అందులో ఎన్టీఆర్ -చరణ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. దేశవ్యాప్తంగా వీరికి కూడా క్రేజ్ వచ్చింది. రాంచరణ్ రంగస్థలం సినిమా తర్వాత మళ్లీ అంతటి నటనను ఈ సినిమాలో కనబరిచాడని చాలా మంది మెచ్చుకున్నారు. ఇక చరణ్ సినిమా సినిమాకు తనలోని నటనా ప్రావీణ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నాడు. తండ్రిలోని మెగా శక్తిని.. బాబాయ్ పవన్ కళ్యాణ్‌లోని మాస్ రేంజ్‌ను మెయింటెన్ చేస్తున్నాడు కాబట్టే చరణ్‌కు మెగాపవర్ స్టార్ అనే బిరుదు వచ్చిందని ఫ్యాన్స్ అంటున్నారు.
చరణ్ తన డెబ్యూ సినిమా చిరుతలో పెద్దగా నటనా శైలి కనిపించలేదు కానీ ఇప్పుడు సంపూర్ణ నటుడిగా మారాడంటూ విమర్శకులు కూడా ప్రశంసిస్తున్నారు. కాగా, మెగాస్టార్ చిరంజీవి తన కొడుకును సినిమాల్లోకి తీసుకుని వచ్చి హీరోను చేయడం కంటే నలుగురికి మంచి చేసే వ్యక్తిగా చేయాలనుకున్నారట..ఎందుకంటే సినిమాల్లో విజయాలు ఎప్పుడూ రావు. ఎదగనీయకుండా తొక్కేవారు ఎప్పుడూ కాచుకుని కూర్చుంటారు. చిన్న తప్పు చేసినా పేరును బద్నాం చేసే వాళ్లు ఉంటారని చిరు భయపడ్డాడట..చరణ్ మంచి నటుడు కాకపోతే చిరుకు బ్యాడ్ నేమ్ వస్తుందని, అసమర్థ కుమారుడికి జన్మనిచ్చావని తనను బ్లేమ్ చేసే రోజు రావొద్దని అనుకున్నారట.. ఇక చరణ్ చదువులో పెద్దగా రాణించకపోవడంతో పాటు హీరో అవుతానని చెర్రీ చెప్పడంతో కొడుకు కోరికను కాదనలేక ఓకే చెప్పాడట చిరంజీవి.