Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి కి తన ఇద్దరు తమ్ముళ్లు అంటే ఎంత ప్రాణమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి నుండి వారికి అన్ని విషయాలలో అండగా ఉంటూ తగు సూచనలు చేస్తూ ఈ స్థాయిలో ఉండేలా చేశాడు. అయితే ఎప్పుడు పవన్‌కి అండగా ఉండే చిరంజీవి ఓసారి మాత్రం గట్టి దెబ్బే కొట్టాడట. ఆ దెబ్బకు పవన్ కోలుకోలేకపోయాడు అని చెబుతుంటారు. వివరాలలోకి వెళితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన కెరీర్ లో చాలా ప్రయోగాత్మక సనిమాలు చేశారు. అలా పవన్ కల్యాణ్ నటించిన సినిమాలలో గుడుంబా శంకర్ చిత్రం ఒకటి. ఇందులో పవన్ సరికొత్త స్టైల్‌లో కనిపించారు.
ఈ సినిమా విడుదలైన తొలి రోజే నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. టీవీలోమాత్రం ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది. టీవీలో వచ్చిన ప్రతిసారి ఈ సినిమాకి మంచి ప్రేక్షకాదరణ ఉంటుంది. అయితే ఈ చిత్రానికి బసవా వీర శంకర్ దర్శకత్వం వహించగా, నాగబాబు నిర్మించారు. అప్పటికే నాగబాబు కౌరవుడు అనే సినిమాతో దారుణంగా నష్టపోయారు. దాంతో పవన్ గుడుంబా శంకర్ సినిమాను తన అన్న నిర్మాణంలోనే చేసి నష్టాల నుండి గట్టెక్కించాలని ఎంతో ప్లాన్ చేశాడు. ఈ సినిమా కథ నుండి పాటల వరకూ అన్నింటా పవన్ కల్యాణ్ ఇన్వాల్స్ మెంట్ తప్పక ఉండేదట.రిలీజ్‌కి ముందు విడుదలైన ఈ సినిమా పాటలు సూపర్ హిట్ అవ్వడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఊహించినట్టే ఫస్ట్ డే అయితే కలెక్షన్ల వర్షం కురిసింది. కానీ సినిమాకు మెల్లమెల్లగా నెగెటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా విడుదలైన తరవాత ఐదువారాల గ్యాప్ లో చిరంజీవి హీరోగా నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా రిలీజ్ కాగా, ఇది గుడుంబా శంకర్ కలెక్షన్స్ పై బాగానే దెబ్బ కొట్టింది. శంకర్ దాదా ఎంబీబీఎస్ విడుదలతో చాలా థియేటర్ లలో గుడుంబా శంకర్ సినిమాను తీసేయగా, ఇది లాంగ్ రన్‌లో కేవలం పదమూడు కోట్లు రాబట్టింది. గుడుంబా శంకర్ సినిమాతో నాగబాబు ఆర్థిక పరిస్థితి కొంచెం నిరాశపరచింది. అయితే చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా విడుదల చేయకపోతే గుడుంబా శంకర్ కు మరిన్నికలెక్షన్స్ వచ్చేవని చెబుతుంటారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.