Chiranjeevi : కొడుకు కోసం ప్రేమగా ఎగ్ దోసె చేసిన చిరంజీవి.. రుచి చూసి ఫుల్ ఖుష్ అయిన చరణ్… వీడియో
Chiranjeevi : మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ గా ఎన్నో కీర్తి ప్రతిష్టలు పొందిన చిరంజీవి పండుగలకు తన ఫ్యామిలీతో చేసు సందడి మాములుగా ఉండదు. అందరితో చాలా కలివిడిగా ఉంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. ఈ సారి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మెగాఫ్యామిలీ అంతా ఒక్క చోట చేరారు. మూడ్రోజుల పండుగలో భాగంగా భోగి రోజు భోగి మంటలు వేసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు తానే స్వయంగా అట్లు వేశారు చిరంజీవి .
Chiranjeevi కుమారుడి కోసం ప్రత్యేకమైన దోసె
చిరు దోసె ఎంత స్పెషల్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పండుగ రోజు చిరంజీవి స్వయంగా దోసెలు చేసి అందరికి అందించాడు. అయితే తన కుమారుడు చరణ్ కోసం ప్రత్యేకంగా చిరు దోసె వేయగా, అది ఆరగించి రామ్ చరణ్ చాలా సంతోషించాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే ఫ్యామిలీ మెంబర్స్ కోసం చిరంజీవి, వరుణ్ తేజ్ చెఫ్ మాస్టర్లుగా మారారు. ఇద్దరూ రుచికరమైన దోశలు వేస్తూ వడ్డించారు.వరుణ్ తనకన్నా బాగా దోశలు వేస్తుండటంతో అసూయపడ్డాడు చిరంజీవి. ‘అది సరిగా రాలేదు, నాకు కుళ్లు వచ్చేసింది. ఇది దోశ కాదు ఉప్మా’ అంటూ వరుణ్ వేసిన దోశను చెడగొట్టాడు చిరు. బాస్‌తో 101వ దోశ అన్న క్యాప్షన్‌తో వరుణ్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.

Chiranjeevi egg omelet For Ram charan VIral video
chiranjeevi కొడుకు కోసం ప్రేమగా-దో
నాగబాబు, నిహారిక కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో భాగమయ్యారు. ఇంటి ముందు ముగ్గులు, వరుణ్ దోశలతో సహా ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్న సన్నివేశాలనంతటినీ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది నిహారిక. అల్లు అరవింద్ ఫ్యామిలీ, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, చిరు తల్లితో పాటు కొందరు కుటుంబ సభ్యులు సెలబ్రేషన్స్‌లో పాల్గొని సంతోషంగా గడిపారు.
Mega ???? @KChiruTweets enjoys cooking ????
And he served to?? None other than @AlwaysRamCharan ❤️ ❤️ pic.twitter.com/j24kWuQ93q— Shreyas Group (@shreyasgroup) January 15, 2022