Chiranjeevi : చిరంజీవి దెబ్బకి తల బాదుకున్న మూర్తాన్న…!!

Advertisement

Chiranjeevi ; తెలుగు చలనచిత్ర రంగంలో ఆర్ నారాయణ మూర్తి పేరు తెలియని వారు ఉండరు. ఎన్నో సందేశాత్మక చిత్రాలు తీసి… సినిమాయే జీవితంగా ధ్యేయంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఇండస్ట్రీలో ఎంతో పేరు సెలబ్రిటీ స్టేటస్ సంపాదించుకున్న గాని…ఎక్కడ కూడా ఆడంబరాలకు వెళ్లకుండా సామాన్య జీవితాన్ని గడుపుతుంటారు. సమాజంలో సామాన్యుడిని లక్ష్యంగా చేసుకొని వారిని చైతన్య పరిచే రీతిలో… ఆలోచింపజేసే సినిమాలను చిత్రీకరిస్తూ ఉంటారు. ఆయన సినిమా వేడుకలు కూడా.. చాలా సాధారణంగా జరుగుతాయి. కానీ ఆర్ నారాయణమూర్తికి సంబంధించి ఒక సినిమా వేడుకకు ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ…

Advertisement
Chiranjeevi Emotional Words About R Narayana Murthy 
Chiranjeevi Emotional Words About R Narayana Murthy

ఇండస్ట్రీలో మొదటి నుండి సినిమా అంటే చాలా పేశన్ గా భావించే వ్యక్తి ఆర్ నారాయణ మూర్తి. తాను తన ఫస్ట్ సినిమా పునాదిరాళ్లు నాటి నుండి చూస్తున్నాను. అప్పుడు ఎలా ఉన్నారో… ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. అవకాశాల కోసం అనేక ఆఫీసులో చుట్టూ తిరిగిన నారాయణమూర్తిని చూశాను ఇప్పుడు మంచి పేరు సంపాదించుకున్న నారాయణమూర్తిని చూశాను ఎక్కడా కూడా తన జీవితంలో.. సెలబ్రిటీ అన్న ఆహం రాలేదు. కమర్షియల్ గా కూడా తన వ్యక్తిత్వాన్ని అమ్ముకోలేదు. ఉదాహరణకు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన “టెంపర్” అనే సినిమాలో .. ఆయన వ్యక్తిత్వానికి తగ్గట్టు నారాయణమూర్తి అనే క్యారెక్టర్ క్రియేట్ చేశారు.

Advertisement

Chiranjeevi's best wishes for Murthy

దానికి ఆయన అయితేనే బాగుంటుందని సంప్రదించగా… దయచేసి నన్ను కమర్షియల్ గా చేయొద్దు అని ఆయన తిరస్కరించారు. నిజంగా అది ఆయన వ్యక్తిత్వం. నారాయణమూర్తి ఎక్కడ కూడా తనని తాను అమ్ముకునే మనిషి కాదు. నమ్మిన దాన్ని బలంగా పట్టుకుంటాడు. ఆ రీతిగానే సినిమాతో పెళ్లి చేసుకుని సినిమాతోనే బాంధవ్యము ఏర్పరచుకొని కొనసాగుతున్నారు. ఈ రీతిగా బతకడం అనేది చాలా కష్టం అంటూ ఆర్ నారాయణమూర్తిని చిరంజీవి అప్పట్లో పొగిడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement
Advertisement