“బ్రో” ఫంక్షన్ లో పవన్ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి అదిరిపోయే వివరణ వీడియో..!!

Advertisement

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా “భోళా శంకర్” ఆగస్టు 11 వ తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ గత ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి తన ప్రసంగంలో భాగంగా బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. కష్టపడి పైకి వస్తేనే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. ఇండస్ట్రీ ఎవరి సొత్తు కాదు అంటూ మెగా హీరోలను ఉద్దేశించి.. వారి సినిమా కెరియర్ ప్రారంభంలో చెప్పిన మాటలు పవన్ తెలియజేయడం జరిగింది.

Advertisement

ఈ మాటలనే “భోళా శంకర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ ఈ ఇండస్ట్రీ ఎవరి సొత్తు కాదు అదే విధంగా ఎవరి గుత్తాధిపత్యం లేదు. టాలెంట్ ఉంటే ఇక్కడ ఎవరైనా రాణించొచ్చు. అదేవిధంగా మా ఇంటిలో హీరోలు అంతమంది ఉన్నా సరే వాళ్ళను పుష్ చేయడానికి .. పైకి తీసుకురావడానికి తామేమి ప్రయత్నాలు చేయమని చెప్పుకొచ్చారు. మీ ప్రయత్నం మీరు చేయండి. మిమ్మల్ని నమ్ముకుని కథలు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వస్తే.. మిమ్మల్ని మీరు నిరూపించుకోండి.. అని చెప్పడం జరిగింది.

Advertisement
chiranjeevi explanation about pawan Kalyan comments in bro movie function
chiranjeevi explanation about pawan Kalyan comments in bro movie function

అదే కళ్యాణ్ పునరుద్ఘటీంచాడు నేను కూడా అదే చెబుతున్నాను.. అని స్పీచ్ ఇచ్చారు. ఈ “భోళా శంకర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా గురించి హీరోయిన్ కీర్తి సురేష్ గురించి చిరంజీవి సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని దీమా వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement