Chiranjeevi – Garikapati : మెగాస్టార్ చిరంజీవిని అవమానించినట్లుగా గరికపాటి మాట్లాడాడు అంటూ నిన్నటి నుండి సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు గరికపాటి పై వస్తున్నాయి. బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో జరిగిన అలాయ్ బలాయ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు గరికపాటి వారు కూడా హాజరైన విషయం తెలిసిందే. చిరంజీవి మాట్లాడుతున్న సమయంలో గరికపాటి వారికి అత్యంత ప్రాముఖ్యతను కల్పించి తల వంచి నమస్కరించిన విషయం తెలిసిందే. తనకంటే ఎందులోనైనా తక్కువ వాడే అయినప్పటికీ గరికపాటి వారికి తలవంచి మరి చిరంజీవి నమస్కరించిన తీరు ప్రతి ఒక్కరిని ఆకర్షించింది.. అభినందనీయం అంటూ ప్రశంసలు దక్కించుకుంది. ఈ విషయంలో చిరంజీవి పది మెట్లు పైకి ఎక్కారు, అదే సమయంలో గరికపాటి వారు పది మెట్లు కిందికి దిగినట్లుగా వ్యవహరించారు అంటూ విమర్శలు మూట కట్టుకుంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఎక్కడికి వెళ్లినా కూడా అభిమానులు పెద్ద ఎత్తునయనాన్ని చుట్టు ముట్టి ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపిస్తారు. ఆయనకు కూడా అలా ఇష్టం ఉండదు కానీ అభిమానుల కోసం కాస్త ఇబ్బంది పడుతున్నా కూడా భరిస్తూ వాళ్లకు కావాల్సిన ఫోటోలు ఇస్తూ ఉంటాడు. తాను ఎంత కాదనుకున్న అభిమానులు తోసుకొస్తుండడంతో చిరంజీవి ఉండాల్సి వస్తుంది. ఆ విషయాన్ని గరికపాటి వారు పట్టించుకోకుండా తాను మాట్లాడాలనుకుంటున్నాను చిరంజీవి ఫోటో సెషన్ ఆపేస్తే నేను మాట్లాడుతాను లేదంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళి పోతాను అంటూ సీట్లోంచి నిల్చని వెళ్లి పోయేందుకు ప్రయత్నించారు. అప్పుడే కార్యక్రమ నిర్వాహకులు వెంటనే గరికపాటి వారిని నిలిపారు. అదే సమయంలో చిరంజీవి కూడా అభిమానులను పక్కకు నెట్టేసుకుంటూ వచ్చి సీట్లో కూర్చున్నాడు.
ఈ సంఘటన అక్కడున్న వారికి చిన్న విషయంగా అనిపించినా మెగా ఫాన్స్ కి మాత్రం చాలా పెద్దగా తోస్తుంది. గరికపాటి మరియు చిరంజీవి ఇద్దరు మధ్య ఎలాంటి విభేదాలు లేవు, కానీ గరికపాటి వ్యవహరించిన తీరు ఏమాత్రం కరెక్ట్ కాదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన మాట్లాడుతున్న సమయంలో ఇబ్బంది కలిగించడం వల్ల ఆ సమయంలో గరికపాటి చేసిన వ్యాఖ్యలు సమర్ధనీయం కాదు.. కానీ విమర్శనాత్మకమైతే కాదు, అయినా కూడా మెగా ఫాన్స్ కొందరు గరికపాటిని తీవ్ర అసభ్య పదజాలంతో విమర్శిస్తున్నారు, పాపం పెద్దాయనని అలా తిట్టడం కరెక్ట్ కాదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గరికపాటి వారి తీరు సరి కాకపోవచ్చు కానీ ఆయన్ను బూతులు తిట్టే అంత తప్పేం చేయలేదు అనేది కొందరి అభిప్రాయం. ఈ విషయమై మెగాస్టార్ చిరంజీవి ఎలా స్పందిస్తారు, అలాగే గరికపాటి వారి నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుంది అనేది చూడాలి.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.