Home » Entertainment » Arohi Rao Warning To Anchor Shiva In Bigg Boss Buzz Interview
Entertainment

Anchor Shiva : యాంకర్ శివ మీద రెచ్చిపోయిన బిగ్ బాస్ అమ్మాయి.. మిస్ అవ్వకూడని వీడియో

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: October 7, 2022, 7:00 pm
Advertisement

Anchor Shiva : బిగ్ బాస్ హౌస్ లో ఉండటం అంటే మామూలు విషయం కాదు. గత వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ఆరోహీ రావు బయటికొచ్చాక బిగ్ బాస్ హౌస్ లో జరిగిన చాలా విషయాల గురించి చెప్పింది. నిజానికి బిగ్ బాస్ హౌస్ లో ఉండటం అంటే మామూలు విషయం కాదు. బిగ్ బాస్ హౌస్ లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇమేజ్ నే బ్యాడ్ చేసుకునే ప్రమాదం ఉంటుంది. చాలామంది అలా తమ ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకొని బయటికి వచ్చారు. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ అబ్బాయిలతో చనువుగా ఉన్నా…

Advertisement

మగవాళ్లతో మాట్లాడినా వాళ్ల మధ్య ఏదో ఉందని ఆరోపిస్తారు. అందుకే బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగినా కూడా అది బయటకు మరోరకంగా రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే బిగ్ బాస్ హౌస్ కు వెళ్లడం కాదు.. అక్కడ ఆట ఆడటం అనేది చాలా ముఖ్యం. అయితే.. బిగ్ బాస్ హౌస్ నుంచి గత వారం ఎలిమినేట్ అయిన ఆరోహి రావు.. బయటికి వచ్చాక బిగ్ బాస్ హౌస్ లో జరిగిన పలు విషయాలను చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో యాంకర్ శివతో ఆరోహి పాల్గొన్నది. ఈ సందర్భంగా నీ జర్నీ ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్ లో అని ప్రశ్నించాడు యాంకర్ శివ. దీంతో అందరితో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యా అని చెప్పుకొచ్చింది ఆరోహి. ఎవరితో ఎక్కువగా కనెక్ట్ అయ్యావు అని మళ్లీ అడుగుతాడు యాంకర్ శివ.

arohi rao warning to anchor shiva in bigg boss buzz interview

Advertisement

Anchor Shiva : ఆర్జే సూర్యతో చనువుగా ఉన్నందుకే ఆరోహిని ఎలిమినేట్ చేశారా?

దీంతో ఎమోషనల్ గా అంటే శ్రీహాన్, కీర్తితో అంటుంది. దీంతో సేఫ్ గా చెబుతున్నావా? లేక తప్పుగా చెబుతున్నావా? అని అంటాడు యాంకర్ శివ. దీంతో నువ్వు ఎవరి పేరు అయినా ఎక్స్ పెక్ట్ చేస్తున్నావా అని అడుగుతుంది ఆరోహి. దీంతో అవును.. నువ్వు ఆ పేరు చెబుతావేమో అని వెయిట్ చేస్తున్నా అంటాడు యాంకర్ శివ. నువ్వు ఎప్పుడైతే నీ కోసం ఆడటం ఆపేశావో అప్పుడే నీ గ్రాఫ్ పడిపోయింది అంటాడు. దీంతో నేను దీనికి ఒప్పుకోను అంటుంది ఆరోహి. నువ్వు ఒప్పుకునేది ఏంటి.. ఇదే నిదర్శనం అంటాడు యాంకర్ శివ. దీంతో మాది ప్యూర్ ఫ్రెండ్ షిప్ అంటుంది ఆరోహీ. ఆర్జే సూర్య వ్యవహారంతోనే తను బయటికి వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆరోహి ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి