Chiranjeevi : ర‌వితేజ‌ – చిరంజీవి మ‌ధ్య గొడ‌వ‌లా.. అవాక్క‌వుతున్న అభిమానులు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chiranjeevi : ర‌వితేజ‌ – చిరంజీవి మ‌ధ్య గొడ‌వ‌లా.. అవాక్క‌వుతున్న అభిమానులు

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వివాదాల‌కు చాలా దూరం.ఆయ‌న ఎప్పుడు చాలా సౌమ్యంగా ఉంటారు. ఎవ‌రేమ‌న్నా అన్నా కూడా న‌వ్వుతూ ప‌ల‌క‌రిస్తుంటారు. ఇటీవ‌ల గరిక‌పాటి చిరంజీవితో అమార్య‌ద‌గా ప్ర‌వ‌ర్తించిన కూడా ఆయ‌న చాలా లైట్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు ర‌వితేజ‌తో చిరంజీవికి గొడ‌వ‌లు ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. అయ‌తే ఇది రియల్ లైఫ్‌లో కాదు రీల్ లైఫ్‌లో. చిరంజీవి ప్ర‌స్తుతం గాడ్ ఫాద‌ర్ స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా విజ‌యం సాధించ‌డంతో చిరు టీం వ‌రుస […]

 Authored By sandeep | The Telugu News | Updated on :16 October 2022,2:30 pm

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వివాదాల‌కు చాలా దూరం.ఆయ‌న ఎప్పుడు చాలా సౌమ్యంగా ఉంటారు. ఎవ‌రేమ‌న్నా అన్నా కూడా న‌వ్వుతూ ప‌ల‌క‌రిస్తుంటారు. ఇటీవ‌ల గరిక‌పాటి చిరంజీవితో అమార్య‌ద‌గా ప్ర‌వ‌ర్తించిన కూడా ఆయ‌న చాలా లైట్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు ర‌వితేజ‌తో చిరంజీవికి గొడ‌వ‌లు ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. అయ‌తే ఇది రియల్ లైఫ్‌లో కాదు రీల్ లైఫ్‌లో. చిరంజీవి ప్ర‌స్తుతం గాడ్ ఫాద‌ర్ స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా విజ‌యం సాధించ‌డంతో చిరు టీం వ‌రుస ఇంట‌ర్వ్యూలు ఇస్తూ అభిమానుల్లో జోష్ నింపుతోంది.

కాగా చిరంజీవి చేస్తున్న సినిమాల‌కు సంబంధించి ఏదో ఒక అప్‌డేట్ ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్‌లో రౌండ‌ప్ చేస్తూనే ఉంది. మెగాస్టార్ న‌టిస్తున్న చిత్రాల్లో ఒక‌టి 154వ సినిమా. బాబీ (కేఎస్ ర‌వీంద్ర‌) డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం కూడా శ‌ర‌వేగంగా ప‌నులు జ‌రుపుకుంటుంది. మాస్ ఎంట‌ర్ టైన‌ర్‌గా వ‌స్తున్న‌ ఈ చిత్రంలో మాస్ మ‌హారాజా ర‌వితేజ వైజాగ్ రంగ‌రాజు అనే మాస్ పోలీసాఫీస‌ర్‌గా న‌టిస్తున్నాడని టాలీవుడ్ స‌ర్కిల్ లో జోరుగా వార్త‌లు షికారు చేస్తున్నాయి. ఇక చిరంజీవి వాల్తేరు వీర‌య్య‌గా ర‌వితేజ సోద‌రుడి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ఇందులో ర‌వితేజ చిరంజీవి మ‌ధ్య విబేదాలు ఏర్ప‌డ‌తాయ‌ని ఏదో విష‌యంలో గొడ‌వ‌లు ప‌డ‌తాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.

Chiranjeevi fight with ravi teja

Chiranjeevi fight with ravi teja

Chiranjeevi : ఎందుకీ గొడ‌వ‌లు..

మ‌రి ఇందులో నిజ‌మెంత ఉంద‌నేది తెలియాల్సి ఉంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో శృతిహాస‌న్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో న‌టిస్తోంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. దాదాపు 22 సంవ‌త్స‌రాల త‌ర్వాత ర‌వితేజ‌, చిరంజీవి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అంత‌క‌ముందు వీరిద్ద‌రు క‌లిసి అన్న‌య్య సినిమాలో న‌టించారు. ఇందులో ర‌వితేజ చిరు త‌మ్ముడిగాక‌నిపించి అల‌రించారు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి ప్ర‌స్తుతం భోళా శంక‌ర్ చిత్రంతో ప‌ల‌క‌రించేందుకు సిద్ద‌మ‌వుతున్నాడు. ఈ మూవీపై కూడా అంచ‌నాలు బారీగానే ఉన్నాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది