Chiranjeevi : చిరంజీవి నమ్మకాలు నిజమయ్యేనా మెహర్ రమేష్ ..?
Chiranjeevi : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో డిజాస్టర్ డైరెక్టర్స్ అని కొందరికి పేరుంది. అంటే వారు హిట్స్ కంటే భారీ డిజాస్టర్సే ఎక్కువగా తీసి ఈ పేరు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో మెహర్ రమేష్ ఒకరు. కంత్రీ, బిల్లా, శక్తి, షాడో లాంటి సినిమాలు తీసిన మెహర్ రమేష్ ఒకటి అరా తప్ప మిగతా సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్స్‌గా నిలిచినవే. సినీ నేపథ్యం కాస్త పెద్దదే అయినా ఈ దర్శకుడు నిలదొక్కుకోలేకపోయాడు. అయితే, కన్నడలో మాత్రం పునీత్ రాజ్‌కుమార్‌కు ఇక్కడ ఫ్లాపైన సినిమా కథలతో అక్కడ భారీ హిట్స్ ఇచ్చాడు. ఆ రకంగా మెహర్ రమేష్‌పై బాగానే సాఫ్ట్ కార్నర్ ఉంది.
సినిమా మేకింగ్ స్టైలిష్‌గా హాలీవుడ్ రేంజ్‌లో సినిమా తీసే మెహర్ రమేష్‌కు కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. హీరోను స్క్రీన్‌పై అద్భుతంగా చూపిస్తాడు. అందుకే, ఇంకా ఆప్పుడప్పుడు తన గురించి మాట్లాడుకుంటున్నారు. దీనివల్లే మెగాస్టార్ చిరంజీవి ఎంతో ధైర్యం చేసి భారీ ప్రాజెక్ట్ మెహర్ రమేష్‌కు అప్పగించారు. తమిళంలో అజిత్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ వేదాళం తెలుగు రీమేక్‌ను చిరు భోళా శంకర్‌గా చేస్తున్నారు. ఇది సిస్టర్ సెంటిమెంట్‌తో సాగే కథ. పాయింట్ రొటీన్ అయినా దర్శకుడు శివ తమిళ ప్రేక్షకులకు తగ్గట్టుగా కథ, కథనాలలో ఆసక్తిని చూపించి హిట్ ఇచ్చాడు.ఇప్పుడు అదే కథ చిరంజీవి చేస్తున్నారు. మెగా అభిమానులందరూ ఈ సినిమాపై చాలా నమ్మకాలు పెట్టుకున్నారు.
Chiranjeevi : చిరు మెహర్ రమేష్‌కు ఈ ప్రాజెక్ట్ అప్పగించినప్పటి నుంచి కొంత నెగిటివ్ టాక్..?
తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరు సోదరి పాత్రలో కనిపించబోతోంది. చిరు – కీర్తిల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్ అవుతాయని టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్‌ను మాంచి మాసివ్ గెటప్‌లో మెహర్ చూపించబోతున్నారని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే సగ భాగం టాకీ పార్ట్, సాంగ్స్, కొన్ని యాక్షన్ సీన్స్ పూర్తైయ్యాయి. ఆచార్య తర్వాత చిరు కాస్త బ్రేక్ తీసుకొని మళ్ళీ సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నారు. తాజా షెడ్యూల్ కోసం భారీ సెట్ నిర్మించారు. ఇందులో రామ్ – లక్ష్మణ్ ఆధ్వర్యంలో పోరాట ఘట్టాలను తెరకెక్కిస్తారు. చిరుపై ఈ సీన్స్ ఉండబోతున్నాయి. చిరు మెహర్ రమేష్‌కు ఈ ప్రాజెక్ట్ అప్పగించినప్పటి నుంచి కొంత నెగిటివ్ టాక్ కూడా వినిపిస్తోంది. మరి మెగాస్టార్, మెగా ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకాలను మెహర్ ఎంతవరకు అందుకుంటాడో చూడాలి.