Chiranjeevi : వైఎస్ జగన్ గురించి ఎన్నడూ లేనంత తీవ్రవ్యాఖ్యలు చేసిన చిరంజీవి..!!
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఆరుపదుల వయస్సులోను కుర్ర హీరోలతో పోటీపడుతూ వరుస సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. జనవరి 13న సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ చిత్రం విడుదల కానుంది. జై లవకుశ ఫేం కే.ఎస్. రవీంద్ర (బాబీ) తెరెక్కించిన ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషించారు. శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మెగా మల్టీస్టారర్ ఈనెల 13న గ్రాండ్‌గా రిలీజ్ కి సిద్ధమైంది.. దీనికి ముందు సినిమా ప్రమోషన్లలో భాగంగా విశాఖపట్నంలో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించిన విషయం విదితమే.
నిజంగా గ్రేట్, ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి స్పీచ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగగా, ఈవెంట్‌లో చిరంజీవి ఎక్కడా కూడా వైసీపీకి ఎదురు మాట్లాడలేదు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం జగన్ ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవిని కాస్త ఇబ్బందులకు గురిచేసింది . అయినప్పటికీ ఇవేవీ పట్టించుకోకుండా వాల్తేరు వీరయ్య రిలీజ్ ఈవెంట్లో ఇక ప్రభుత్వానికి అధికారాలకు థాంక్స్ అని చెప్పారు. తనని అంత వేధించిన మెగాస్టార్ కు ఇంత మంచితనం అవసరమా.. అన్నయ్య అసలు ఎందుకు తగ్గుతున్నాడు అంటూ చర్చలు జరుపుతున్నారు. ఇక ఈవెంట్‌లో చిరు .. ఎంతో ఓర్పు కలిగిన వీరి మధ్య సొంతంగా ఇల్లు కట్టుకుని సెటిల్ అవ్వాలనేది నా చిరకాల కోరిక అని అన్నాడు. ఇటీవలే ఇక్కడ స్థలం కొన్నాను.
త్వరలోనే ఇల్లు కూడా కట్టుకుంటాను’ అని పేర్కోన్నారు.వాల్తేరు వీరయ్య ఈవెంట్‌ని ముందుగా అనుకున్న ప్లేస్ లో కాకుండా చివరికి వేరే ప్లేస్ కేటాయించి ఇక్కడ ఈవెంట్ చేసుకోండి అంటూ జగన్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.ఇది చిరుని కూడా చాలా బాధించింది. ఈ విషయంపై తాజాగా మాట్లాడుతూ.. నేను తగ్గడం అవసరమే.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో తాను ఫైర్ అయితే.. నా ఈగో సాటిస్ఫై అవుతుందేమో కానీ సినిమా, ప్రొడ్యూసర్స్, ఫ్యాన్స్ అంతా ఇబ్బందులు పడతారు. ఇది సినిమాకి, సినిమా పరిశ్రమకి అస్సలు మంచిది కాదు. అందుకే తగ్గడంలో తప్పులేదు అని చిరు చెప్పారు. చిరు మాటలు విన్న వాళ్లంతా ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.