Chiranjeevi GodFather Movie First Look Released
GodFather First Look : మెగాస్టార్ చిరంజీవి సినిమాలంటే ప్రేక్షకులకి ఎంత ఆసక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ కుర్రకారుతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్న చిరంజీవి రీసెంట్‌గా ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కాస్త నిరాశపరచింది. చిరంజీవి కెరీర్ లో పొలిటికల్ థ్రిల్లర్స్ చేసింది తక్కువ. ఆయన మలయాళ చిత్రం లూసిఫర్ పై మనసు పారేసుకున్నారు. మోహన్ లాల్ పాత్ర చేయాలని డిసైడ్ అయ్యాడు. రీమేక్ హక్కులు కొని గాడ్ ఫాదర్ గా తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్న గాడ్ ఫాదర్ చాలా వరకు షూటింగ్ జరుపుకుంది.
ఈ క్రమంలో గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. ఇందులో చిరంజీవి మాస్ లుక్ కేక పెట్టిస్తుంది.హై ఓల్టేజ్ మాస్ అప్పీల్ తో ఉన్న ఈ లుక్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ పిక్ మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం గాడ్ ఫాదర్ లుక్ నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది.మెగాస్టార్ చిరంజీవి, నయనతార గతంలో ‘సైరా’ సినిమా కోసం కలిసి పని చేశారు. మళ్ళీ ఇప్పుడు ‘గాడ్ ఫాదర్’ సినిమా కోసం ఈ ఇద్దరూ పనిచేస్తున్నారు. అయితే, చిరంజీవి సరసన హీరోయిన్ కాదు. నిజానికి, వరుసకి చెల్లెలవుతుంది ఈ సినిమాలో చిరంజీవి పాత్రకి నయనతార పాత్ర.
Chiranjeevi GodFather Movie First Look Released
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, యాంకర్ అనసూయ, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది.సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు మెహర్ రమేష్ డైరెక్షన్‌లో ‘భోళా శంకర్’, బాబీ దర్శకత్వంలో ‘మెగా 154’ సినిమాల్లో నటిస్తున్నాడు. తమిళ్ సూపర్ హిట్ సినిమా ‘వేదాళం’కు రీమేక్‌గా భోళా శంకర్ మూవీ తెరకెక్కుతోంది. వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో ‘మెగా 154’ రూపొందుతోంది. ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్‌లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
This website uses cookies.