meena husband property 250 crores
Meena : ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన మీనా ఇప్పుడు మాత్రం సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తుంది. అయితే రీసెంట్‌గా ఆమె ఇంట్లో విషాదం నెలకొంది. మీనా భర్త విద్యాసాగర్ ఆకస్మిక మరణం సినీ వర్గాలు, సినీ ప్రేక్షకులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. జూన్ 30వ తేదీ గురువారం ఆయన చెన్నైలోని ప్రముఖ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన వయసు 48 సంవత్సరాలు. చిన్న వయస్సులోనే మీనా భర్త మృతి చెందంతో అందరు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతికి సంబంధించి అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసాయి.
సుదీర్ఘకాలంగా విద్యాసాగర్ ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. కొన్నేళ్లుగా చికిత్స పొందుతున్నారు. ఓ దశలో ఊపిరితిత్తుల మార్పిడి చేసేందుకు ప్రయత్నించారు. కానీ అది వీలు కాలేదు అని కుష్బూ పేర్కొన్నారు. అయితే తాజాగా మీనా భర్త ఆస్తుల లెక్కలు ఇవే అంటూ ఓ న్యూస్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సాఫ్ట్ వేర్ ఇంజీనీర్ అయిన మీనా భర్తకి టోటల్ గా 250కోట్ల ఆస్తి ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన 7 దేశాలల్లో సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్నత స్దాయి పోజీషన్ లో ఉన్నారట. మంచి టాలెంటెడ్ అని కూడా సమాచారం. కానీ, ఇలా చిన్న వయసుల్లోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడం బాధాకరం.
meena husband property 250 crores
భర్త విద్యాసాగర్ మరణం తరువాత పలు వార్తలు హల్‌చల్ చేస్తున్న నేపథ్యంలో మీనా తొలిసారి స్పందించారు. తాను ఎంతో ప్రేమించిన భర్త విద్యాసాగర్ మరణంతో తీవ్రవిచారంలో ఉన్నామంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తమకు ప్రైవసీ ఇవ్వాలని.. పరిస్థితిని అర్థం చేసుకుని మీడియా సంయమనం పాటించాలంటూ రిక్వెస్ట్ చేశారు. తన భర్త మరణం విషయంలో ఎలాంటి అసత్య వార్తలు ప్రసారం చేయవద్దని కోరారు. ఇలాంటి కష్ట సమయంలో తమ కుటుంటానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని చెప్పారు. తమిళనాడు సీఎం స్టాలిన్, హెల్త్ మినిస్టర్, IAS అధికారి రాధాకృష్ణన్, స్నేహితులు, బంధువులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.