GodFather Teaser : టాలీవుడ్‌లో పెను సంచలనం సృష్టిస్తోన్న గాడ్‌ఫాదర్ టీజర్
GodFather Teaser : టాలీవుడ్ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ సినిమా పెనుసంచలనం సృష్టిస్తోంది.కొద్దిసేపటి కిందట విడుదలైన ఈ సినిమా టీజర్ క్షణాల్లోనే వైరల్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి సంబంధించిన టీజర్ విడుదల కోసం మెగా అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు గాడ్ ఫాదర్ మూవీ టీజర్ విడుదల కావడంతో సోషల్ మీడియాను ఫ్యాన్స్ షేక్ చేస్తున్నారు..
GodFather Teaser : పొలిటికల్ కింగ్ మేకర్‌గా చిరు
మళయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాను తెలుగులో దర్శకుడు మోహన రాజా గాడ్ ఫాదర్‌గా తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి హీరోగా, నయన్ తార హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన అప్టేడ్ రావడంతో ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాకు కొణిదెల ప్రొడక్షన్‌లో చిరు తనయుడు రామ్ చరణ్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బీవీ చౌదవి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, సత్యదేవ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సెన్సెషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బాణీలు అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.
ఇక తాజాగా విడుదలైన గాడ్ ఫాదర్ టీజర్‌లో చిరు రోల్ చాలా అద్భుతంగా ఉంది. పొలిటికల్ కింగ్ మేకర్‌గా చిరు కీలక పాత్రలో నటిస్తున్నారు. మళయాళం లూసిఫర్ స్టోరీని డైరెక్టర్ తెలుగు నెటివిటీగా తగ్గట్టుగా మార్చినట్టు తెలుస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను చిత్తు చేసే పవర్ ఫుల పాత్రలో చిరు ఈ సినిమాలో కనిపిస్తారని మూవీ యూనిట్ చెబుతోంది. ముందు ముందు ఈ సినిమా ఇంకెన్ని సంచనాలు క్రియేట్ చేస్తుందో వేచిచూడాల్సిందే.
