Chiranjeevi : యాంక‌ర్ చేసిన త‌ప్పు.. అలిగి వెళ్లిపోయిన చిరంజీవి

Authored By Sam C | The Telugu News | Published on: June 13, 2022, 7:30 pm

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ వార్త ఇటీవ‌ల కాలంలో తెగ వైర‌ల్ అవుతుంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియ‌దు కాని, ప్ర‌తి ఒక్క‌రు దీనిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుపుతున్నారు. తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు మెగాస్టార్ చిరంజీవి ఒక షోకి చీఫ్ గెస్ట్ గా వెళ్లారని తెలుస్తోంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో షో కి యాంకర్ గా వ్యవహరిస్తున్న వ్యక్తి షో స్పాన్సర్ విషయంలో ఒక పేరు తప్పుగా పలికారని, దీంతో మెగాస్టార్ చిరంజీవిని మరోసారి రీటేక్ చేయమని కోరారని తెలుస్తోంది.

అయితే ఈ విషయంలో కాస్త హర్ట్ అయిన మెగాస్టార్ చిరంజీవి వెంటనే షో నుంచి వాకౌట్ చేశారని ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. షో షూటింగ్ జరుగుతున్న సమయంలో షో కి యాంకర్ గా వ్యవహరిస్తున్న వ్యక్తి స్పాన్సర్ విషయంలో ఒక పేరు తప్పుగా పలికారని, దీంతో మెగాస్టార్ చిరంజీవిని మరోసారి రీటేక్ చేయమని కోరగా.. ఈ విషయంలో కాస్త హర్ట్ అయిన మెగాస్టార్ చిరంజీవి వెంటనే షో నుంచి వాకౌట్ చేశారని ఫిలింనగర్ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆ షో ఏంటి అనే విషయం మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు. కానీ దాని పేరు గురించి కూడా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.

chiranjeevi hurt and walk out from show

chiranjeevi hurt and walk out from show

Chiranjeevi : నిజ‌మెంతో?

మెగాస్టార్ చిరంజీవి చేతిలో ప్రస్తుతం వరుస సినిమాలు ఉన్నాయి. ఆయన హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్, మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్, బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమాలు ఉన్నాయి. అలాగే మరో పక్క వెంకీ కుడుముల దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య నిర్మాణంలో కూడా ఆయన ఒక సినిమా చేస్తానని ప్రకటించారు. జూన్ 21వ తేదీ నుంచి భోళా శంకర్ షూటింగ్ ప్రారంభం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ షెడ్యూల్ షూటింగ్ లో సినిమా లో భాగమైన దాదాపు అందరూ కనిపిస్తారని తెలుస్తోంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp