Chiranjeevi : బాక్సాఫీస్ లెక్కను ఎప్పటికప్పుడు సరిచేయడానికి మన టాలీవుడ్ దర్శకులు, హీరోలు గట్టిగా పోటీ పడుతుంటారు. ముఖ్యంగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తన సినిమాలతో కొత్త చరిత్ర సృష్ఠించడమే కాదు..బాక్సాఫీస్ వద్ద సరికొత్త లెక్కను నమోదు చేస్తున్నారు. ఓ దర్శకుడిగా ఇప్పటి వరకు రాజమౌళీని బీట్ చేసిన వారెవరూ లేరనే చెప్పాలి. ఇక హీరోలతో మాత్రం ఈ లెక్క మారుతూ ఉంటుంది. ఒక్కోసారి ఒక్కో హీరో సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సునామీని సృష్ఠించి సరికొత్తగా రికార్డులను క్రియేట్ చేస్తుంది.
అయితే, ఇప్పుడు ఈ లెక్కలను సరిచేసి సరికొత్త లెక్కను చూపించడానికి మెగాస్టార్ చిరంజీవి రెడీ అవుతున్నారు. పులి ఒక్క అడుగు వెనక్కి వేసిందంటే నాలుగడుగులు ముందుకు వేస్తుంది. అదే చిరు చేయబోతున్నారు. మెగాస్టార్ నటించిన గత చిత్రం భారీ డిజాస్టర్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆచార్య సినిమాతో అద్భుతమైన వసూళ్ళు వస్తాయని అందరూ భావించారు. ఆర్ఆర్ తర్వాత ఈ ఏడాది అత్యధిక వసూళ్ళు రాబట్టేది ఆచార్య సినిమానే అనుకున్నారు.
అందుకే, చిరంజీవి తాను నటిస్తున్న మూడు సినిమాలను మాంచి సీజన్‌లో దింపడానికి పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారట. ఇప్పటికే, బాబీ దర్శకత్వంలో నటిస్తున్న మెగా 154 2023 సంక్రాంతికి తీసుకురావాలని డిసైడయి రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. డేట్ తప్ప సీజన్ చెప్పేశారు. అలాగే, ఇదే ఏడాది గాడ్ ఫాదర్ సినిమాను, భోళా శంకర్ సినిమాను రిలీజ్ చేయాలని గట్టి పట్టుదలతో సిద్ధం చేస్తున్నారు. ఎంత పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నా కూడా తన సినిమానే భారీ వసూళ్ళు సాధించాలని ప్లాన్ చేస్తున్నారు. దసరాకి ఒకసినిమాను, క్రిస్మస్ కానుకగా మరో సినిమాను రిలీజ్ చేయడానికి చిరు ప్లాన్ చేస్తున్నారట. మరి మెగా ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.