Chiranjeevi బిగ్ న్యూస్ : వైఎస్ జగన్ తో మీట్.. మంచు విష్ణు వాహనం లోపలికి, చిరంజీవి వాహనం బయటే
Chiranjeevi : టాలీవుడ్ టికెట్ ధరల వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వ్యవహారం విషయంలో సినీ పెద్దలు ఇటీవల జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం వద్దకు వెళ్ళారు. సిఎం వైఎస్ జగన్ తో దాదాపు గంట పాటు సమావేశం నిర్వహించి థియేటర్ యాజమాన్యాల కష్టాలను వివరించారు. ఆ తర్వాతి రోజు మంత్రి పేర్ని నానీ హైదరాబాద్ లో మోహన్ బాబు ఇంటికి వెళ్లి సమావేశం అయ్యారు.
ఇక ఇది పక్కన పెడితే… సీఎంతో భేటీకి సంబంధించి తనకు ఆహ్వానం అందలేదని మంత్రి పేర్ని నానికి చెప్పిన మోహన్ బాబు, మంచు విష్ణు… ఆ తర్వాత సిఎం జగన్ ను కలిసే ప్రయత్నం చేసారు. సీఎం దృష్టికి ఈ సమాచారం వెళ్లడంతో మంచు విష్ణుని నేడు ప్రత్యేకంగా విందుకు సీఎం జగన్ ఆహ్వానించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకూ వీరి మధ్య సమావేశం జరుగుతుంది.

Chiranjeevi Manchu Vishnu Meet With Ys Jagan
సినీ పరిశ్రమకు సంబంధించి టిక్కెట్ల వ్యవహారం , ప్రభుత్వం ఇచ్చే రాయితీలు సహా పలు ఇతర అంశాల పైన వీరి మధ్య చర్చ జరగనుంది. చిరంజీవి బృందంతో జరిగిన సమావేశ వివరాలను కూడా మంచు విష్ణుకు సిఎం జగన్ చెప్పే అవకాశం ఉంది. ఇక సిఎం జగన్ వద్దకు చిరంజీవి బృందం వెళ్ళే సమయంలో వాహనాన్ని లోపలికి అనుమతించని భద్రతా సిబ్బంది… మంచు విష్ణు వాహనాన్ని మాత్రం అనుమతించారు.