Waltair Veerayya Teaser : వచ్చాడ్రోయ్ వాల్తేరు వీరయ్య.. మెగాస్టార్ మెగా మాస్ టీజర్ అరాచకమే భయ్యా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Waltair Veerayya Teaser : వచ్చాడ్రోయ్ వాల్తేరు వీరయ్య.. మెగాస్టార్ మెగా మాస్ టీజర్ అరాచకమే భయ్యా..!

 Authored By ramesh | The Telugu News | Updated on :24 October 2022,12:30 pm

Waltair Veerayya Teaser : మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలీజైంది. ఈ టీజర్ మెగా ఫ్యాన్స్ ని విశేషంగా అలరిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నుంచి ఫ్యాన్స్ ఆశించే మాస్ అంశాలను ఈ సినిమాలో పుష్కలంగా పెట్టినట్టు అనిపిస్తుంది. మెగా మాస్ టీజర్ తో వాల్తేరు వీరయ్య అరాచకం అనిపించేశాడు. పూల చొక్కా.. గల్ల లుంగీ.. నోట్లో బీడీ.. మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన వింటేజ్ మాస్ లుక్ తో ఈ సినిమాతో కనిపిస్తున్నారని చెప్పొచ్చు. ఈ మెగా టీజర్ కి ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ ప్రియులు కూడా సూపర్ అనేస్తున్నారు.

కె.ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ డైరక్షన్ లో వస్తున్న ఈ వాల్తేరు వీరయ్య సినిమా టీజర్ మాత్రం అంచనాలను మించి వచ్చిందని చెప్పొచ్చు. టీజర్ తోనే మాస్ ట్రీట్ ఇచ్చిన డైరక్టర్ ఇక సినిమా మొత్తం మాస్ అభిమానులకు జాతరే అనిపించేలా చేశాడు. సినిమాలో చిరుతో పాటుగా మాస్ మహరాజ్ రవితేజ కూడా నటిస్తున్నాడు. హ్యాపీ దీపావళి అంటూ వాళ్తేరు వీరయ్య టీజర్ మెగా ఫ్యాన్స్ కి ఈ పండుగ మరింత జోష్ తెచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి నుంచి రాబోతున్న మెగా మాస్ మూవీగా వాల్తేరు వీరయ్య వస్తున్నాడు.

chiranjeevi mega 154 waltair veerayya title teaser

chiranjeevi mega 154 waltair veerayya title teaser

సంక్రాంతికి మెగా మాస్ జాతరకి అంతా సిద్ధం అయిపోవచ్చు. ఈమధ్యనే గాడ్ ఫాదర్ తో హిట్ అందుకున్న చిరు వాళ్తేరు వీరయ్యతో మరో సూపర్ హిట్ కి సిద్ధం అవుతున్నాడు. చిరు మాస్ లుక్ కి అంతే మాస్ రేంజ్ దేవి మ్యూజిక్ మరింత హైలెట్ అయ్యింది. టీజర్ చివర్లో రవితేజ వాయిస్ ఇంకాస్త క్రేజ్ తెచ్చింది. ఫైనల్ గా దీపావళి మెగా గిఫ్ట్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి ఈ వాల్తేరు వీరయ్య ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

YouTube video

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది