Chiranjeevi : చిరంజీవి సినిమాపై ఎన్టీఆర్ ప్ర‌భుత్వం క‌క్ష్య సాధించిందా.. ఆ నాటి విష‌యంలో నిజమెంత‌? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chiranjeevi : చిరంజీవి సినిమాపై ఎన్టీఆర్ ప్ర‌భుత్వం క‌క్ష్య సాధించిందా.. ఆ నాటి విష‌యంలో నిజమెంత‌?

Chiranjeevi : చిరంజీవి, ఎన్టీఆర్.. ఈ రెండు పేర్లు టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం. మెగాస్టార్ చిరంజీవి గురించి.. ఆయన నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలో కష్టపడి స్టార్ హీరోగా ఎదిగాడు చిరంజీవి. ఇక ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీగా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్నాడు. ఈయన ప్రతి ఒక్క దర్శక నిర్మాతలతో, చాలామంది హీరోయిన్లతో నటించాడు. అంతేకాకుండా స్టార్ హీరోలు ఎన్టీఆర్, సినిమాలలో కూడా నటించాడు చిరంజీవి. చిరంజీవి […]

 Authored By sandeep | The Telugu News | Updated on :16 August 2022,9:40 pm

Chiranjeevi : చిరంజీవి, ఎన్టీఆర్.. ఈ రెండు పేర్లు టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం. మెగాస్టార్ చిరంజీవి గురించి.. ఆయన నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలో కష్టపడి స్టార్ హీరోగా ఎదిగాడు చిరంజీవి. ఇక ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీగా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్నాడు. ఈయన ప్రతి ఒక్క దర్శక నిర్మాతలతో, చాలామంది హీరోయిన్లతో నటించాడు. అంతేకాకుండా స్టార్ హీరోలు ఎన్టీఆర్, సినిమాలలో కూడా నటించాడు చిరంజీవి. చిరంజీవి డ్యాన్సులు అంటే మాస్ ప్రేక్షకులు ఊగిపోయేవారు.ఇప్ప‌టికీ అదే రేంజ్‌లో ఉన్నార‌నుకోండి అయితే చెల్లి సెంటిమెంట్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా చిరంజీవి అల్లుడా మ‌జాకా అనే సినిమా చేశాడు.

Chiranjeevi : ఇలా జ‌రిగిందా?

గ్రామీణ నేపథ్యంలో జరిగే కథతో పాటు చెల్లి సెంటిమెంట్ తో తెర‌కెక్కిన ఈ చిత్రంలో గడుసరి అత్తకు బుద్ధి చెప్పే అల్లుడుగా సీతారాముడు పాత్రలో చిరంజీవి నటించారు. ఈ సినిమాలో మా ఊరి దేవుడు అంటూ వచ్చే పాట తెలుగు నాట మార్మోగింది. ఇప్పటికీ ఈ పాట శ్రీరామనవమి పందిళ్ళలో వినిపిస్తూ ఉంటుంది. ద‌ర్శ‌కుడు ఈవీవీ సత్యనారాయణకు చిరంజీవితో ఇదే తొలి సినిమా. 1995 ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉందన్న విమర్శలు రావడంతో ఎన్టీఆర్ ప్రభుత్వంలో అధికారులు సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పడంతో పాటు ప్రదర్శన నిలిపివేస్తామని కూడా ప్రకటించింది.

Chiranjeevi Movie Banned By NTR

Chiranjeevi Movie Banned By NTR

ఈ విషయంపై మెగా అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేఖంగా ర్యాలీలు చేశారు. త‌మ గ్రామాల‌లో నిరాహార దీక్ష‌లు చేయ‌డం ఇలా ప‌లు ర‌కాలుగా అభిమానులు తమ నిర‌స‌న తెలియ‌జేశారు. అయితే మొత్తానికి అభిమానులు న్టీఆర్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చేశారు. అలా వివాదాల మధ్య రిలీజ్ అయిన అల్లుడా మజాకా 27 కేంద్రాల్లో డైరెక్ట్ గా 100 రోజులు… షిఫ్టులతో మరో 20 సెంటర్లలో మొత్తం 47 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.ఈ సినిమా సెన్సేష‌న్ చూసి అంద‌రు నోరెళ్ల‌పెట్టారు . ఈ విష‌యం అప్ప‌ట్లో తెగ హాట్ టాపిక్ కాగా, ఇప్పుడు దీని గురించి తెలుసుకున్న వారు ఔరా అని నోరెళ్ల‌పెడుతున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది