Chiranjeevi Movie Banned By NTR
Chiranjeevi : చిరంజీవి, ఎన్టీఆర్.. ఈ రెండు పేర్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం. మెగాస్టార్ చిరంజీవి గురించి.. ఆయన నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలో కష్టపడి స్టార్ హీరోగా ఎదిగాడు చిరంజీవి. ఇక ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీగా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్నాడు. ఈయన ప్రతి ఒక్క దర్శక నిర్మాతలతో, చాలామంది హీరోయిన్లతో నటించాడు. అంతేకాకుండా స్టార్ హీరోలు ఎన్టీఆర్, సినిమాలలో కూడా నటించాడు చిరంజీవి. చిరంజీవి డ్యాన్సులు అంటే మాస్ ప్రేక్షకులు ఊగిపోయేవారు.ఇప్పటికీ అదే రేంజ్‌లో ఉన్నారనుకోండి అయితే చెల్లి సెంటిమెంట్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా చిరంజీవి అల్లుడా మజాకా అనే సినిమా చేశాడు.
గ్రామీణ నేపథ్యంలో జరిగే కథతో పాటు చెల్లి సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో గడుసరి అత్తకు బుద్ధి చెప్పే అల్లుడుగా సీతారాముడు పాత్రలో చిరంజీవి నటించారు. ఈ సినిమాలో మా ఊరి దేవుడు అంటూ వచ్చే పాట తెలుగు నాట మార్మోగింది. ఇప్పటికీ ఈ పాట శ్రీరామనవమి పందిళ్ళలో వినిపిస్తూ ఉంటుంది. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు చిరంజీవితో ఇదే తొలి సినిమా. 1995 ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉందన్న విమర్శలు రావడంతో ఎన్టీఆర్ ప్రభుత్వంలో అధికారులు సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పడంతో పాటు ప్రదర్శన నిలిపివేస్తామని కూడా ప్రకటించింది.
Chiranjeevi Movie Banned By NTR
ఈ విషయంపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ర్యాలీలు చేశారు. తమ గ్రామాలలో నిరాహార దీక్షలు చేయడం ఇలా పలు రకాలుగా అభిమానులు తమ నిరసన తెలియజేశారు. అయితే మొత్తానికి అభిమానులు న్టీఆర్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చేశారు. అలా వివాదాల మధ్య రిలీజ్ అయిన అల్లుడా మజాకా 27 కేంద్రాల్లో డైరెక్ట్ గా 100 రోజులు… షిఫ్టులతో మరో 20 సెంటర్లలో మొత్తం 47 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.ఈ సినిమా సెన్సేషన్ చూసి అందరు నోరెళ్లపెట్టారు . ఈ విషయం అప్పట్లో తెగ హాట్ టాపిక్ కాగా, ఇప్పుడు దీని గురించి తెలుసుకున్న వారు ఔరా అని నోరెళ్లపెడుతున్నారు.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.